Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ‘పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. కాగా రెండు బాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది. ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో ధనుంజయ, సునీల్, అనసూయ, అజయ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. కాగా ఈ నెల 6న ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా బన్నీ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది మూవీ యూనిట్. ‘పుష్ప’ ట్రైలర్ టీజ్ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అల్లు అర్జున్ బైక్ స్టంట్ కొంచెం చూపించారు. సునీల్, అజయ్, అనసూయ, రావు రమేష్, ధనుంజయ తదితరుల పాత్రలను అలా అలా చూపించారు. నోట్లో బ్లేడు పెట్టుకుని ఒకరికి అనసూయ వార్నింగ్ ఇస్తున్న దృశ్యాన్ని ఇందులో చూడవచ్చు. రష్మికా కూడా బైక్ నడుపుతూ ఉండే సీన్, సాంగ్స్ విజువల్స్ చూపించారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ పై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత ఓ స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో పాటు స్టెప్పులేయనుంది. ఇప్పుడు ఈ వీడియోతో ట్రైలర్, సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
The tease of #PushpaTrailer is out now! 😎
▶️ https://t.co/xEoOyAeHiYAll set to blow your minds on DEC 6th 🔥#PushpaTheRise#ThaggedheLe 🤙#PushpaTheRiseOnDec17 pic.twitter.com/AneZ31O2cW
— Pushpa (@PushpaMovie) December 3, 2021