James Cameron Avatar 2: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు జేమ్స్ కెమరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్ 2 ‘ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఈ నెల ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రపంచం లో ఉన్న అన్ని బాషలలో ఘనం గా విడుదల కాబోతుంది..తెలుగు వెర్షన్ కి సంబంధించి డైలాగ్స్ మొత్తం ప్రముఖ నటుడు , రచయత మరియు దర్శకుడైన అవసరాల శ్రీనివాస్ రాసాడు..ఈ చిత్రానికి తెలుగులో కూడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..అడ్వాన్స్ బుకింగ్స్ ప్రతీ చోట ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షో ని లోను లో ప్రదర్శించారు..ఇప్పుడు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ప్రీమియర్ షో ని ఏర్పాటు చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి..అయితే ఈ ప్రీమియర్ షో కి జేమ్స్ కెమరూన్ హాజరు కావడం లేదట..ఆయన తప్ప మూవీ యూనిట్ మొత్తం ఈ స్పెషల్ ప్రీమియర్ షో కి పాల్గొనబోతున్నారట.
జేమ్స్ కెమరూన్ ఈ షో కి అటెండ్ కాలేకపోతున్నందుకు కారణం ఆయనకీ కరోనా సోకడమే..ఇటీవల కాస్త అస్వస్థతకు గురైన జేమ్స్ కెమరూన్ డాక్టర్లతో చెకప్ చేయించుకోగా ఆయనకీ కరోనా సోకినట్టు నిర్థారించారట..దీనితో ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం జేమ్స్ కామెరాన్ కి తీవ్రమైన అస్వస్థత అంటూ ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా బాగా స్ప్రెడ్ అవ్వగా , జేమ్స్ కెమరూన్ తన ట్విట్టర్ ఖాతా నుండి క్లారిటీ ఇచ్చాడు.

‘నా సొంత పార్టీ కి నేను అటెండ్ కాలేకపోతున్నాను..నాకు కరోనా సోకింది..ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నాను , కానీ సోషల్ మీడియా లో వచ్చినట్టు గా అంత క్రిటికల్ గా నా ఆరోగ్యం ఏమి లేదు..త్వరలోనే నేను కోలుకుంటాను’ అంటూ ఇంగ్లీష్ లో ఆయన ఒక ట్వీట్ వేసాడు.. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.