Vijay Sethupathi: విజయ్ సేతుపతిని విక్రమ్ మూవీలో చూసిన ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇంట్రో సీన్లో విజయ్ సేతుపతి బేర్ బాడీలో దర్శనమిచ్చాడు. ఒక విలన్ కి ఆ రేంజ్ మాస్ ఎంట్రీ సీన్ ఊహించం. అయితే విజయ్ సేతుపతికి ఉన్న ఇమేజ్ రీత్యా దర్శకుడు లోకేష్ కనకరాజ్… అంత హైప్ ఇచ్చాడు. ఆ సీన్ సూపర్ గా ఉన్నా.. విజయ్ సేతుపతి బాడీ మాత్రం ఇబ్బంది పెట్టింది. బాగా పెరిగిన పొట్ట క్రిందకు జారుతుంటే, నడుము వెనుక మడతలు కనిపిస్తాయి.

విజయ్ సేతుపతి ఏంటి మరీ ఇలా తయారయ్యాడని ఆడియన్స్, ఫ్యాన్స్ ఒకింత నొచ్చుకున్నారు. విజయ్ సేతుపతి షేప్ అవుట్ బాడీపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. విమర్శించిన వాళ్ళ నోళ్లు దెబ్బకు మూయించాడు విజయ్ సేతుపతి. సగానికి తగ్గిపోయిన విజయ్ సేతుపతి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. విజయ్ సేతుపతి యంగ్ అండ్ స్లిమ్ లుక్ చూసిన వారు వావ్ అంటున్నారు. అదే సమయంలో ఇంత తక్కువ సమయంలో ఎలా బరువు తగ్గారని వాపోతున్నారు.
సన్నబడ్డాక విజయ్ సేతుపతి వయసు ఓ 20 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. పరిశ్రమకు వచ్చిన కొత్తలో విజయ్ సేతుపతి ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉన్నారు. ఇక విజయ్ సేతుపతి ఇంతలా ట్రాన్సఫర్మ్ కావడానికి ఆరోగ్య కారణాలేనా లేక ఏదైనా మూవీలో రోల్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. కారణం ఏదైనా విజయ్ సేతుపతి ప్రస్తుత లుక్ కట్టిపడేస్తుంది. కరుడుగట్టిన విలన్ రోల్స్ చేస్తున్న విజయ్ సేతుపతి లవర్ బాయ్ రోల్స్ కూడా చేయవచ్చనిపిస్తుంది.

96 మూవీలో విజయ్ సేతుపతి లవర్ బాయ్ రోల్ చేశారు. కాకపోతే అతడు భగ్న ప్రేమికుడిగా కనిపిస్తాడు. ఇక విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో పది చిత్రాల వరకు ఉన్నాయి. బాలీవుడ్ లో జవాన్, గాంధీ టాక్స్, ముంబైకర్, మెర్రీ క్రిస్మస్ చిత్రాలు చేస్తున్నారు. తెలుగులో సందీప్ కిషన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మైఖేల్ లో నటిస్తున్నాడు. ఆయన హీరోగా ఒక తమిళ చిత్రం రూపొందుతుంది.