https://oktelugu.com/

Puri Jagannadh: పూరి నుంచి మరో క్రేజీ పాఠం.. ప్రతి మనిషికీ అది ఉండాలి !

Puri Jagannadh: ‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా అద్భుతమే, కొత్త జనరేషన్ కు ఆ మాటలే గొప్ప పాఠాలు. అందుకే ‘పూరీ మ్యూజింగ్స్’కి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలను ముఖ్యంగా ప్ర‌పంచంలోని వింత‌లను, విశేషాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా చెప్పుకొస్తోన్న ఈ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాడు. టాపిక్ పేరు ‘ఇకిగాయ్‌’. దీని గురించి పూరి మాటల్లోనే.. ‘ఆనందం కోసం జపనీయుల […]

Written By:
  • Shiva
  • , Updated On : January 14, 2022 / 10:47 AM IST
    Follow us on

    Puri Jagannadh: ‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా అద్భుతమే, కొత్త జనరేషన్ కు ఆ మాటలే గొప్ప పాఠాలు. అందుకే ‘పూరీ మ్యూజింగ్స్’కి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలను ముఖ్యంగా ప్ర‌పంచంలోని వింత‌లను, విశేషాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా చెప్పుకొస్తోన్న ఈ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాడు. టాపిక్ పేరు ‘ఇకిగాయ్‌’.

    Puri Jagannadh

    దీని గురించి పూరి మాటల్లోనే.. ‘ఆనందం కోసం జపనీయుల దగ్గర ‘ఇకిగాయ్‌’ అనే ఓ కొత్త టాపిక్ ఉంది. ఎక్కువగా డబ్బు సంపాదించటం, మన కోరకల్ని తీర్చుకోవటం, అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవటం… వీటిల్లో మనం ఏం చేస్తే జీవితంలో ఆనందంగా ఉంటాం? అనే విషయాన్ని ముందు మనిషి తెలుసుకోవడం బెటర్, ప్రతి మనిషికీ ఒక ఇకిగాయ్‌ ఉండాలి. పూర్వం మనుషులంతా వేటగాళ్లలా బతికారు. తర్వాత మన జాబ్స్‌ లో చాలా మార్పులు వచ్చాయి. కొత్తకొత్త పనులు వచ్చాయి. అలాగే జాబ్స్ వచ్చాయి.

    Also Read:   నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?

    కొందరికి పెయింటింగ్‌ అంటే ఇష్టం, మరికొందరికి డ్యాన్స్‌ అంటే ఇష్టం. అలాంటి ఇష్టమైన పనులు చేస్తుంటే అనవసరమైన ఆలోచనలు మనిషికి రావు. పైగా ఎంతో ఆనందంతో ఉంటారు. కానీ, డబ్బు ఎవరిస్తారు? అందుకే ఏదో ఒక జాబ్ చేస్తుంటాం. కంఫర్దబుల్‌ జీవితం కావాలంటే మనందరికీ డబ్బు కావాలి కదా. అయితే, అది ఎంత మొత్తమో తెలుసుకోవాలి. నాలుగు విషయాల్లో మీరు ఎందులో ఉన్నారో చెక్‌ చేసుకోవాలి.

    1. నీకు నచ్చింది చేయటం. 2. ప్రపంచానికి నచ్చింది చేయటం. 3. ఎక్కువ డబ్బు వచ్చేది చేయటం. 4. నువ్వు ఎందులో స్పెషలిస్ట్రవో ఆ రంగంలో పనిచేయటం. మీరు 1, 4 మధ్య ఉంటే అది ప్యాషన్‌. ఒకవేళ మీరు 1& 2 మధ్య ఉంటే అది మిషన్‌. మీ పనిని ఇంకా బాగా ఎలా చేయాలో ఆలోచించండి. 3& 4 మధ్య ఉంటే అది ప్రొఫెషన్‌. ఇందులో మీకు ఇష్టమైనవి, కొత్తకొత్త విషయాలు తెలుసుకోవాలి. 2& 4 మధ్య ఉంటే ఒకేషన్‌. చేస్తున్నదాన్ని సవాలుగా తీసుకుని ఇంకా బెటర్‌ అయ్యేలా చూడాలి. ముఖ్యంగా మనకేం కావాలో తెలియాలి. మనం ఏం
    చేస్తున్నామో తెలియాలి. అదే ఇకిగాయ్‌. ఇంతకీ ఇకిగాయ్‌ అంటే రీజన్‌ ఫర్‌ యువర్‌ బీయింగ్‌’ అని పూరీ చెప్పుకుకొచ్చాడు.

    Also Read: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో జాబ్స్.. భారీ వేతనంతో?నీళ్లలో ఉప్పు వేసుకుని తాగితే ఇన్ని లాభాలా.. ఆ ఆరోగ్య సమస్యలకు చెక్!

    Tags