Actress Remuneration: ప్రస్తుతం సినిమాలలో నటించే స్టార్ హీరోయిన్లు ఒక్కో సినిమాకు కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే సినిమా హీరోయిన్ల రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో కాకపోయినా సీరియల్ హీరోయిన్లు సైతం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొంతమంది టాప్ సీరియల్ హీరోయిన్లు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా పాపులర్ అయిన నవ్యస్వామి, కస్తూరి సీరియల్ ద్వారా ఫేమస్ అయిన ఐశ్వర్య, దేవతతో పాటు పలు తెలుగు సీరియళ్ల ద్వారా గుర్తింపును సంపాదించుకున్న సుహాసిని రోజుకు 20,000 రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. హీరోయిన్ల తల్లి పాత్రలతో పాటు ఇతర కీలక పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్న హరిత రోజుకు 12,000 రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
Also Read: Prabhas Maruthi Movie: అందుకే అతనితో ఒప్పుకున్నా.. ప్రభాస్ ఫుల్ క్లారిటీ !
మరో సీరియల్ హీరోయిన్ పల్లవి రామిశెట్టి రోజుకు 15,000 రూపాయల చొప్పున రెమ్యునరేషన్ అందుకుంటున్నారని బోగట్టా. కార్తీకదీపం సీరియల్ ద్వారా పాపులర్ అయిన ప్రేమీ విశ్వనాథ్ రోజుకు 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. త్రినయని సీరియల్ ద్వారా పాపులర్ అయిన అషికా రోజుకు 12,000 రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.
ఇతర సీరియల్ హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు రోజుకు 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. కొంతమంది సీరియల్ హీరోయిన్ల పారితోషికం సినిమా హీరోయిన్లతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తంగా ఉండటం గమనార్హం.
Also Read: Natural Star Nani: స్టార్ డైరెక్టర్ కి హీరో నానీ వార్నింగ్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended Videos:



[…] Also Read:Actress Remuneration: ఈ సీరియల్ హీరోయిన్ల రెమ్యునర… […]