Indian Cinema Directors: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్స్ గా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా వాళ్లు కూడా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ గా మారి ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయాలని చూస్తుంటారు. ఇక ఇప్పటివరకు ఇండియాలో ఉన్న దర్శకులందరిలో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకున్న దర్శకుడు మాత్రం రాజమౌళి అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా సంపాదించి పెట్టారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన మహేష్ బాబు తో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తూ ఉండడం విశేషం…అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోలకు భారీ ఎలివేషన్స్ ఇస్తు వాళ్ళను టాప్ లెవల్లో చూపించడం లో రాజమౌళి మొదటి స్థానం లో ఉంటాడు. ఇక అతడి తర్వాత స్థానంలో ప్రశాంత్ నీల్ ఉన్నాడు.
Also Read: రోజురోజుకు పడిపోతున్న ‘కూలీ’ వసూళ్లు..6వ రోజు వచ్చింది ఎంతంటే!
ఒక సీన్ ని ప్రేక్షకుడి చేత ఎమోషనల్ గా కనెక్ట్ చేయించి ఆ సీన్స్ ను హైలైట్ గా చేసి చూపించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించే ఏకైక దర్శకుడు ప్రశాంత్ నీల్… ప్రస్తుతం వీళ్లిద్దరు మాత్రమే హీరోలకు భారీ ఎలివేషన్స్ ను ఇస్తూ భారీ రేంజ్ లో సినిమాలు తీయగలుగుతున్నారు. ఇక మరి కొంతమంది కమర్షియల్ ఫార్మాట్ ను ఫాలో అవుతూ ఎలివేషన్ ను ఇచ్చినప్పటికి అవి ప్రేక్షకుడికి అంత బాగా రీచ్ అవ్వడం లేదనేది వాస్తవం…
ఇక సలార్ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ చాలా అద్భుతమైన కేర్ తీసుకొని మరి ప్రభాస్ ని నెక్స్ట్ లెవెల్లో నిలిపాడు. అలాంటి దర్శకుడి నుంచి ఇకమీదట రాబోయే సినిమాలు కూడా అలానే ఉండబోతున్నాయి అనేది వాస్తవం… సగటు ప్రేక్షకులు సైతం ఆయన నుంచి ఎమోషన్ తో కూడిన ఎలివేషన్స్ ఇచ్చే సన్నివేశాలని కోరుకుంటున్నారు.
Also Read: బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’కు ఎండ్ కార్డ్.. ఊహించని ట్విస్ట్.. ఏం జరిగిందంటే?
కాబట్టి తను కూడా ఆ సినిమాలకే ఓటు వేస్తున్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఇక మీదట అతని నుంచి రాబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి. తద్వారా ఆయా హీరోలకి ఆయన భారీ ఎలివేషన్స్ ఇస్తూ స్టార్ హీరోలుగా నిలబెడతాడా? లేదా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది…