Top Heroines: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి ఉన్నంత గుర్తింపు హీరోయిన్ల కైతే ఉండదు. ఇక హీరోల కెరియర్ 30,40 సంవత్సరాల పాటు కొనసాగుతూనే ఉంటుంది. కానీ హీరోయిన్ ల కెరీర్ అలా ఉండదు. ఒకటి రెండు ఫ్లాప్ సినిమా వచ్చాయి అంటే చాలు వాళ్లను తమ సినిమాల్లో తీసుకోవడానికి ఏ దర్శక నిర్మాతలు కూడా సాహసించరు. ఇక ఇలాంటి క్రమంలోనే పూజా హెగ్డే లాంటి నటి అరవింద సమేత, అరవైకుంఠపురం లాంటి భారీ సక్సెస్ లతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపుని తీసుకురాకపోవడంతో డీలా పడిపోయింది. ప్రస్తుతం ఆమె చాలా వరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి. ఇప్పుడున్న హీరోయిన్స్ మధ్య జరుగుతున్న పోటీలో పోలిస్తే ఆమెకు అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు…
ఇక ఆమెతో పాటు శ్రీలీల సైతం కెరియర్ స్టార్టింగ్ లో స్టార్ హీరోలందరితో సినిమాలను చేసుకుంటూ వచ్చింది. ఆమె చేసిన సినిమాలు చేసినట్టు ఫ్లాప్ అవుతుండటం వల్ల ప్రస్తుతం ఆమె క్రేజ్ విపరీతంగా తగ్గిపోయింది. పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో ఆమెకు మంచి గుర్తింపైతే వచ్చింది.
ప్రస్తుతం ఆ గుర్తింపుతోనే ఆమె ఇండస్ట్రీలో కొనసాగుతుందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మీదనే ఆమె భారీ ఆశలైతే పెట్టుకుంది… ఇక పూజ హెగ్డే, శ్రీలీల ఇద్దరు కూడా ఒక సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది… మరోసారి టాప్ హీరోయిన్స్ గా గుర్తింపును సంపాదించుకోవాలి అంటే ఇప్పుడు చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాలి. లేకపోతే మాత్రం వాళ్లు చాలా వరకు డీలాపడిపోయే ప్రమాదమైతే ఉంది…
మొత్తానికైతే ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు వాళ్ళు చేస్తున్న సినిమాలతో తమకంటూ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి వాళ్ళు ఫ్యూచర్ లో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…