John Abraham Fitness: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు గొప్ప గుర్తింను సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న హీరోలు చాలామంది సిక్స్ ప్యాక్, 8 ప్యాక్ బాడీ మీద ఎక్కువ కేర్ చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రేక్షకులు సైతం ఆ హీరోలను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. వాళ్ళు కూడా బాడీని ఫిట్నెస్ గా ఉంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ కండల వీరుడిగా గొప్ప పేరును సంపాదించుకున్న జాన్ అబ్రహం సైతం గత కొన్ని సంవత్సరాల నుంచి తన బాడీ ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ వచ్చాడు. అయితే ఆయన ఫిట్నెస్ లో భాగంగా డైట్ ని మైంటైన్ చేస్తూ వచ్చాడు. ఏం తినాలి, ఏం తినకూడదు ఆ బాడీకి తగ్గట్టుగా ఫుడ్స్ ని తీసుకున్నాడు. దానివల్ల ఇప్పుడు అతను కూరగాయలతో భోజనం చేసిన కూడా అతనికి డైజేషన్ అవడం లేదట…
ఓవర్ ఫిట్నెస్ ఓవర్ డైట్ వల్లనే ఇలా అవుతుంది అంటూ కొంతమంది డాక్టర్లు చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా జాన్ అబ్రహం లాంటి కొండల వీరుడు ఇప్పుడు ఇలాంటి ఒక హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉండటం అనేది ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఏదైనా మితంగా ఉంటే బాగుంటుంది.
అది ఓవర్ అయితేనే చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడానికి జాన్ అబ్రహం ను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరు వాళ్ళ బాడీ మీద స్పెషల్ కేర్ తీసుకొని బాడీ బిల్డ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
తెలుగు హీరోలు సైతం ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు బాడీని బిల్డ్ చేయాలి, ఎంతవరకు డైట్ చేయాలి అనేది ఫాలో అయితే బాగుంటుంది. అది కాకుండా ఓవర్ డోస్ అయితే మాత్రం వాళ్లు కూడా ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు… జన అబ్రహం వీలైనంత తొందరగా హెల్తీగా మారి మంచి సినిమాలు చేయాలని కోరుకుందాం…