Rajamouli: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. అలాగే ఇప్పుడు ఇండియన్ సినిమా స్థాయిని కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే రాజమౌళి పేరు ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతుంది అనేది వాస్తవం. హాలీవుడ్ డైరెక్టర్లకు సైతం ఈ సినిమాతో తను పోటీని ఇవ్వబోతున్నాడు అనే విషయమైతే చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఆయనతో సినిమాలు చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటే ఆయనే ఎంత పెద్ద స్టార్ డైరెక్టరో మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక రాజమౌళి డైరెక్టర్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన రోజుల్లో వివి వినాయక్ తనకు గట్టి పోటీ ఇచ్చాడు. వీళ్లిద్దరు మాస్ డైరెక్టర్లుగా ప్రేక్షకులు అలరిస్తూ వచ్చారు. ఇక వివి వినాయక్ ఎప్పటికప్పుడు మాస్ సినిమాలు చేస్తూ రాజమౌళిని సైతం కంగుతినిపించేలా సక్సెస్ లను సాధించాడు.
కానీ రాజమౌళి మాత్రం 100% సక్సెస్ రేట్ ని మైంటైన్ చేస్తూ భారీ విజయాలను అందుకున్నాడు. ఇక ఎట్టకేలకు పాన్ ఇండియా దర్శకుడిగా అవతరించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. ఇక వివి వినాయక్ ఒక స్టేజి వరకు సక్సెస్ లను సాధించాడు ఆ తర్వాత తను తీసే సినిమాలు ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ప్రస్తుతం సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నాడు…
ఒక రకంగా రాజమౌళికి పోటీనిచ్చిన దర్శకులలో పూరి జగన్నాథ్ ను కూడా చెప్పుకోవచ్చు. ఆయన కూడా రాజమౌళి కంటే ముందే స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. రాజమౌళి ఒక ఈవెంట్లో సినిమాలు ఫాస్ట్ గా తీయడంలో నేను పూరి గారితో పోటీ పడలేను అని చెప్పాడు. వీళ్లిద్దరి మధ్య అంతా మంచి పోటీ అయితే ఉండేది. ఇప్పుడు రాజమౌళి టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతే పూరి జగన్నాథ్ మాత్రం రొటీన్ సినిమాలను చేస్తూ డీలా పడిపోయాడు…