Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్… ప్రస్తుతం ఈయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో చేసిన దేవర సినిమా ఈనెల 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఆయన తీవ్రస్థాయిలో ప్రమోషన్స్ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే పలు రకాల ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.అలాగే సంచలన దర్శకుడిగా పేరుపొందిన సందీప్ రెడ్డివంగా తో పాటు ఒక ఇంటర్వ్యూ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అందులో భాగంగానే విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ లాంటి స్టార్ హీరోలతో కూడా ఆయన ఒక ఇంటర్వ్యూ ను ప్లాన్ చేశాడు.
మరి మొత్తానికైతే ఇప్పుడు దేవర సినిమాను ఆదుకునే విధంగా సందీప్ రెడ్డి వంగా, విశ్వక్ సేన్, సిద్దు జొన్నల గడ్డ లాంటివారు ముందుకొచ్చి ఇంటర్వ్యూ లో పాల్గొని దేవర సినిమా మీద హైప్ ని పెంచడానికి భారీ రకాలుగా ప్రయత్నాలు చేయడం అనేది ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ కూడా రాబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాల పట్ల సరైన అవగాహన లేదు. కానీ మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ఫ్రెండ్లీ వాతావరణం అయితే కొనసాగుతుందనే చెప్పాలి. ఇక దేవర సినిమా సక్సెస్ అయితే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా వెలుగొందుతాడు. ఇక ఇప్పటికే విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ లాంటి నటుల సినిమాల ప్రమోషన్స్ కి కూడా జూనియర్ ఎన్టీయార్ హెల్ప్ చేశాడు. ఇక మొత్తానికైతే ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా సక్సెస్ అవుతుందా? లేదా అనే ఒక ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
దాని కోసమే ఆయన తీవ్రమైన ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ను సాధిస్తాడా? లేదంటే ప్లాప్ ను అందుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో కనక సక్సెస్ ని సాధిస్తే వరుసగా 7 సినిమాలతో సక్సెస్ లను అందుకున్న స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేస్తాడు. లేకపోతే మాత్రం ఆరు సినిమాలతో వరుసగా సక్సెస్ ని అందుకున్న హీరోకి ఒక ప్లాప్ సినిమా వచ్చిందనే ఒక చేదు అనుభవాన్ని అయితే మూటగట్టుకోవాల్సి ఉంటుంది…