Top 5 Movies First Week Collections: రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం విడుదలై విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారం రోజుల్లో ఈ చిత్రం కొన్ని ప్రాంతాల్లో రీసెంట్ సూపర్ హిట్స్ దేవర , ఓజీ చిత్రాలను దాటేసింది. కొన్ని సెంటర్స్ లో అయితే #RRR రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టింది. సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇదంతా పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాలు ఏంటి?, పెద్ది ప్రస్తుతానికి ఏ స్థానం లో ఉంది అనేది ఇప్పుడు వివరంగా చూడబోతున్నాము.
1) #RRR : రామ్ చరణ్ , ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద మొదట్లో కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ , ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ చిత్రం విపరీతంగా నచ్చడంతో సెన్సేషనల్ వసూళ్లను నమోదు చేసుకుంది. ఈ చిత్రానికి మొదటి వారం లో తెలుగు రాష్ట్రాల నుండి 187 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
2) పుష్ప 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా , కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలై , మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం తో మొదటి వారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 158 కోట్ల 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
3) కల్కి 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ వెండితెర అద్భుతం గురించి ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 134 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
4) పెద్ది : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పెద్ది’ ప్రీమియర్ షోస్ నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని సెన్సేషన్ సృష్టించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి , మొదటి వారం కూడా కళ్ళు చెదిరే వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి వారం లో 125 కోట్ల 86 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
5) ఓజీ : పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ కారణంగా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. మొదటి వారం లో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 121 కోట్ల రూపాయిల షేర్ వసూలు వచ్చాయి.

