Bigg Boss 9 Telugu Top 3 Contestants: టెలివిజన్ రంగంలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్… ప్రస్తుతం బిగ్ బాస్ తొమ్మిదోవ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ మొదట్లో చాలా డల్ గా నడిచినప్పటికి వైల్డ్ కార్డు ఎంట్రీ తో కొంతమంది కంటెస్టెంట్స్ వచ్చారు. దాంతో ఈ షో మంచి ఊపు అందుకొని టాప్ టీఆర్పీ రేటింగ్ ను అందుకొని ముందుకు దూసుకుపోతోంది…ఇక ఇదంతా చూస్తున్న చాలామంది ప్రేక్షకులు ఈ షోలో ఎవరు విజేతగా నిలుస్తారు అనే దానిమీద చాలా రకాల అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇపుడున్న పొజిషన్ ను బట్టి చూస్తే టాప్ 3 కంటెస్టెంట్స్ గా నిలిచే వ్యక్తులు ఎవరో తెలిసిపోయింది.
ముఖ్యంగా బిగ్ బాస్ యాజమాన్యం సైతం వాళ్ళని టాప్ 3 లో ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకని బిగ్ బాస్ ఇలాంటి ఒక పక్షపాత ధోరణిని వ్యవహరిస్తుందంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నప్పటికి ఆ కంటెస్టెంట్స్ కి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను బట్టే బిగ్ బాస్ కూడా వాళ్లకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇంతకీ ఆ కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఫస్ట్ పొజిషన్లో తనూజ, సెకండ్ పొజిషన్లో సుమన్ శెట్టి, థర్డ్ పొజిషన్ లో ఇమాన్యుల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. టాప్ 3 కంటెస్టెంట్స్ గా నిలిచేది వీళ్లే అంటూ సోషల్ మీడియా లో ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక బిగ్ బాస్ యాజమాన్యం కూడా వీళ్ళ ముగ్గురినే టాప్ 3 లోకి పంపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
బిగ్ బాస్ షోలోకి ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళ ఐడెంటిటిని చూపించుకుంటూ ముందుకు సాగితే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. అలా ప్రేక్షకుల యొక్క మెప్పు పొందిన వారు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. వాళ్లకే బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఎక్కువగా సపోర్ట్ చేస్తుందంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం… తనూజకి ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తుంటే తనే విజేతగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…