Homeఎంటర్టైన్మెంట్Anushka Shetty: అనుష్క వ‌దులుకున్న టాప్ 10 సూప‌ర్‌హిట్ మూవీలు ఇవే..

Anushka Shetty: అనుష్క వ‌దులుకున్న టాప్ 10 సూప‌ర్‌హిట్ మూవీలు ఇవే..

Anushka Shetty: సినిమా రంగం అనేది అవకాశాల చుట్టూ తిరిగే పడవ లాంటివి. హీరో, హీరోయిన్లు ఫుల్ బిజీ గా ఉన్నప్పుడే కొన్ని మంచి సినిమాలు కూడా వస్తుంటాయి. కానీ సమయం లేక వాటిని వదులుకోవడం చివరికి అవి వేరే వారు చేసి హిట్ కొట్టడంతో వారు బాధపడక తప్పదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనుష్క వదులుకున్న 10 సూపర్ హిట్ సినిమాలు ఏవో ఓ సారి తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజనీకాంత్, దీపికా పదుకొనే కలిసి నటించిన మూవీ కొచ్చాడియన్. ఇందులో దీపిక పాత్రకు ముందు అనుష్కను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల అనుష్క ఆ పాత్ర చేయలేకపోయింది. విక్రమ్ హీరోగా వచ్చిన పొన్నయ‌న్ సెల్వన్‌ మూవీలో కూడా ముందుగా అనుష్క కు ఆఫర్ వచ్చింది. కానీ ఆమె వద్దని చెప్పిందట. ఇక ప్రభాస్ హీరోగా వచ్చిన రెబల్ మూవీలో తమన్నా కంటే ముందు అనుష్కను అనుకున్నారు. స్వీటీ వద్దనే సరికి ఆ ఛాన్స్ తమన్నాకు వెళ్ళిపోయింది.

Also Read: మహేష్ బాబు’ మరదలిగా ప్రముఖ హీరో కుమార్తె

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో వచ్చిన దొంగాట మూవీ కూడా ముందుగా స్వీటీ వద్దకే వచ్చింది. ఈ మూవీని కూడా రిజెక్ట్ చేయడంతో ఆ ఛాన్స్ మంచు లక్ష్మిని వరించింది. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో స్వీటీ చేసిన అరుంధతి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీనికి సీక్వెల్ చేయాలని ఆయన ప్లాన్ చేశారట. అనుష్క కొన్ని కార‌ణాల వ‌ల్ల ఒప్పుకోకపోవడంతో అది ఆగిపోయింది. లారెన్స్ డైరెక్ట్ చేసిన కాంచన మూవీని మొదట నాగార్జున, అనుష్కను పెట్టి తీయాలి అనుకున్నారు. కానీ నాగార్జున ఒప్పుకోకపోవడంతో అనుష్క కూడా దీన్ని రిజెక్ట్ చేసింది.

Anushka Shetty
Anushka Shetty

అక్కినేని హీరోలు అందరూ కలిసి నటించిన మనం మూవీలో కూడా ముందుగా అనుష్కకు ఛాన్స్ ఇచ్చారట. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమె దాన్ని రిజెక్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీకి కాజ‌ల్ ప్లేస్ లో ఫ‌స్ట్ అనుష్కని సంప్రదించారట. చివరకు కాజల్ ఫిక్స్ అయిపోయింది. వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప మూవీలో ప్రియ‌మ‌ణి పాత్రకు ముందుగా అనుష్కనే తీసుకోవాలనుకున్నారు. కానీ షరామామూలుగా దీన్ని కూడా వద్దన్నది మన స్వీటీ. నవీన్ పోలిశెట్టితో యు.వి.క్రియేషన్స్ ఒక ప్రాజెక్టు చేయాలనుకుంది. ఇందులో అనుష్కను హీరోయిన్ గా అనుకున్నా.. ఆమె ఒప్పుకోకపోవడంతో ఇది ఆగిపోయింది. ఇలా చాలా కీలకమైన సినిమాలను అనుష్క వివిధ కారణాలతో వదులుకుంది. అవి గనక చేసి ఉంటే ఆమె రేంజ్ మరోలా ఉండేదేమో.

Also Read:  ‘రాధేశ్యామ్’ మూవీలో అద్భుత హైలెట్స్.. ప్రధాన లోపాలేంటో తెలుసా?

 

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Akhil Agent Release Date: దర్శకుడు సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ అంటూ అక్కినేని అఖిల్ తో భారీ కసరత్తులు చేయిస్తున్నాడు. కాగా ‘ఏజెంట్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు రాగా.. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏజెంట్ సినిమా ఆగస్టు 12వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలిపింది. ఈ మేరకు మిషన్ గన్ పట్టుకొని ఉన్న అఖిల్ మాస్ లుక్ ఫోటోను రిలీజ్ చేసింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular