నో కరోనా అంటున్న హీరో

ఎల్విస్ ప్రీస్లీ జీవితం ఆధారంగా నిర్మిస్తున్న హాలీవుడ్ చిత్రం కోసం ఆస్ట్రేలియా వెళ్లి కరోనా బారిన పడ్డ టామ్ హాంక్స్ అతని భార్య ఇపుడు క్షేమంగా ఉన్నారన్నవార్తలొస్తున్నాయి. హాలీవుడ్ సీనియర్ హీరో టామ్ హాంక్స్ అతని భార్య రీటా విల్సన్ పది రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడ్డారు. ఇటీవల టామ్ హాంక్స్ తన భార్యతో కలిసి షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లారు. ఆ సంధర్భంలో వీరికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది.. వైద్య పరీక్షల అనంతరం […]

Written By: Neelambaram, Updated On : March 18, 2020 1:46 pm
Follow us on

ఎల్విస్ ప్రీస్లీ జీవితం ఆధారంగా నిర్మిస్తున్న హాలీవుడ్ చిత్రం కోసం ఆస్ట్రేలియా వెళ్లి కరోనా బారిన పడ్డ టామ్ హాంక్స్ అతని భార్య ఇపుడు క్షేమంగా ఉన్నారన్నవార్తలొస్తున్నాయి.

హాలీవుడ్ సీనియర్ హీరో టామ్ హాంక్స్ అతని భార్య రీటా విల్సన్ పది రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడ్డారు. ఇటీవల టామ్ హాంక్స్ తన భార్యతో కలిసి షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లారు. ఆ సంధర్భంలో వీరికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది.. వైద్య పరీక్షల అనంతరం వీరిని ఐసొలేషన్ వార్డుకి తరలించి ప్రత్యేక చికిత్స అందించారు. కాగా టామ్ హాంక్స్ దంపతులు కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.

టామ్ హాంక్స్ అనేక గొప్ప హాలీవుడ్ చిత్రాలలో నటించారు. టామ్ హాంక్స్ నటించిన చిత్రాల్లో ఫారెస్ట్ గంప్, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, కాస్ట్ అవే వంటి చిత్రాలు ఆయనకు యెనలేని పేరు తెచ్చాయి. ఆయన నటించిన బెస్ట్ మూవీస్ లో ఒకటైన ఫారెస్ట్ గంప్ ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.
Brave people never die