విశ్వ వ్యాప్తంగా మృత్యునాదం చేస్తున్న కరోనా నివారణకు మెడిసిన్ కనుగొనే క్రమంలో ఒక హాలీవుడ్ హీరో తన సతీ సమేతంగా ముందు కొచ్చాడు. కొంత కాలం క్రితం ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి అనూహ్యంగా కరోనా బారిన పడ్డ హాలీవుడ్ హీరో టామ్ హ్యాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్ ఇపుడు పూర్తిగా కోలుకున్నారు దాంతో అక్కడే కరోనా వైరస్ కి చికిత్స తీసుకున్న వీరిద్దరు 14 రోజుల క్వారెంటైన్లో ఉండి కోలుకున్నాక తిరిగి అమెరికా వెళ్లారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా తీవ్రతను గమనించిన టామ్ హ్యాంక్స్ దంపతులు ఇపుడో మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు.
కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ కోసం రక్త నమూనా సేకరణలో వీరు సహకరిస్తున్నారు. దీనిలో భాగంగా వారిద్దరూ తమ రక్తాన్ని దానం చేశారు.తమ శరీరాల్లో ఉన్న యాంటీబాడీలు కరోనా నివారణ వ్యాక్సిన్ తయారీకి ఉపయోగపడుతాయన్న ఆశతో రక్తదానానికి సిద్ధమయ్యారు అంతేకాదు ఒకవేళ వీలైతే తమ ప్లాస్మాను కూడా ఇతర పేషెంట్లకు డొనేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది .live and let live
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Tom hanks and rita wilson are taking part in covid 19 vaccine study
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com