Bullet Bhaskar- Varsha: బుల్లితెరపై బజర్దస్త్ కామెడీషో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది నటులు పాపులర్ అయ్యారు. తమదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అప్పటి వరకు ఎవరికీ తెలియని వారు జబర్దస్త్ తో స్టార్లుగా మారారు. అలాంటి వారిలో వర్ష ఒకరు. ఈ టీవీలో ప్రసారమైన ‘తూర్పు పడమర’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరీయళ్లలో వర్ష నటించింది. కానీ ఈమె జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత వర్ష ఫేమస్ అయింది. మొదట్లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తరువాత పర్మినెంట్ కామెడీ స్టార్ గా మారిపోయింది. ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ టీంలో కొనసాగుతూ కామెడీతో ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా వర్ష పై బుల్లెట్ భాస్కర్ షాకింగ్ కామెంట్ చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలతో వర్ష మొహం మాడిపోయింది. ఇంతకీ బుల్లెట్ భాస్కర్ ఏమన్నాడంటే…?

సినిమాల్లో అవకాశం రాని వారు జబర్దస్త్ ప్రొగ్రాం ద్వారా పాపులర్ అయ్యారు. ఆ తరువాత సినిమాల్లో అవకాశం పొందారు. ఈ నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ ఇండస్త్రీలో జబర్దస్త్ మార్గమధ్యంగా మారింది. దీంతో చాలా మంది జబర్దస్త్ లో నటించేందుకు ఆరాట పడుతారు. ఈ తరుణంలో వర్ష కూడా మొదట్లో సీరియళ్లలో నటించింది. ఎన్నో ఏళ్లుగా ఆమె టీవీ ఇండస్ట్రీలో కొనసాగింది. అయితే ప్రత్యేకంగా ఆమెకు గుర్తింపు రాలేదు. ఆ తరువాత జబర్దస్త్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు నటులతో కలిసి కామెడీ చేస్తూ ఆకట్టుకుంటోంది.
Also Read: Ramarao On Duty Pre Release Event: అతను దక్షిణ భారత దేశంలోనే గొప్ప నటుడు – రవితేజ
బుల్లెట్ భాస్కర్ టీంలో కొనసాగుతున్న వర్ష.. ఇమాన్యూయేల్ కలిసి లవ్ ట్రాక్ కొనసాగిస్తోంది. ముద్దులు, హద్దుల వరకు వెళ్లిన వీరు ప్రేమాయణంలో ఉన్నారని అంటారు.అంతే స్థాయిలో వీరి స్కిట్లు కూడా ఉండడంతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే వచ్చే గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో వర్ష ‘నేను యాంకర్ ను.. ఆ విషయాన్ని ఏవరు నమ్మట్లేదు ఏంటి..?’ అని అంటుంది. బుల్లెట్ భాస్కర్ తో కలిసి ఎంట్రీ సాంగ్ ఇచ్చిన వర్ష ఈ వ్యాఖ్యలు చేసింది.

‘నేను లెఫ్ట్ నుంచి చూస్తే ఇంద్రజ.. రైట్ నుంచి చూస్తే కుష్బూలా ఉంటాను..’ అని అంటుంది. దీంతో బుల్లెట్ భాస్కర్ కలుగజేసుకొని ‘స్ట్రయిట్ నుంచి చూస్తే శాంతి స్వరూప్ లా’ ఉంటావని బుల్లెటు భాస్కర్ అనడంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా షాక్ అవుతారు. వర్ష కుడా బుల్లెట్ భాస్కర్ కామెంట్స్ తో ఆమె మొహం మాడిపోతుంది. అయితే ఫుల్ ఎపిసోడ్ లో మళ్లీ వర్ష ఎలాంటి రిప్లై ఇచ్చిందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.
Also Read:Nani- Ravi Teja: చిరంజీవి రవితేజకు స్ఫూర్తి అయితే, మాకు రవితేజ స్ఫూర్తి – నాని