Temper Movie: టెంపర్ కోర్టు సీన్ ను మార్చేసిన రైటర్… కారణం ఏంటంటే..?

ఒకానొక సమయంలో వాళ్ళ బాబాయ్ అయిన బాలయ్య బాబు సినిమాలకి కూడా పోటీ ఇచ్చేంత స్థాయికి ఎదిగాడు. కానీ మధ్యలో వచ్చిన కొన్ని ఫ్లాప్ సినిమాల వల్ల తన మార్కెట్ భారీగా డౌన్ అయింది.

Written By: Gopi, Updated On : March 4, 2024 2:07 pm

Temper Movie Court Scene

Follow us on

Temper Movie: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే విలక్షణ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ముఖ్యంగా సింగిల్ టేక్ లో డైలాగులను చెబుతూ ఏక సంథాగ్రహిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. తాతకి తగ్గ మనవడిగా కూడా నందమూరి అభిమానుల్లో ఒక గొప్ప పేరు ను సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి ఎన్టీఆర్ వరుసగా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాడు.

ఇక ఒకానొక సమయంలో వాళ్ళ బాబాయ్ అయిన బాలయ్య బాబు సినిమాలకి కూడా పోటీ ఇచ్చేంత స్థాయికి ఎదిగాడు. కానీ మధ్యలో వచ్చిన కొన్ని ఫ్లాప్ సినిమాల వల్ల తన మార్కెట్ భారీగా డౌన్ అయింది. ఇలాంటి సమయంలోనే పూరి జగన్నాథ్ చేసిన టెంపర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా అప్పటినుంచి ఇప్పటివరకు సక్సెస్ ల పంపరని కొనసాగిస్తూ వస్తున్నాడు. అయితే టెంపర్ సినిమాలో(Temper Movie) క్లైమాక్స్ సీన్ అనేది ఆ సినిమా మొత్తానికి చాలా కీలకమైన సీన్ అనే చెప్పాలి. ఇక మొదట ఈ సినిమా క్లైమాక్స్ పూరి జగన్నాథ్ ఒక రకంగా రాసుకుంటే ఈ సినిమా కథ రచయిత అయిన వక్కంతం వంశీ కి మొదట అనుకున్న క్లైమాక్స్ నచ్చలేదట..

దాంతో చివర్లో హీరోని కూడా నేరం చేసిన వాళ్లలో ఒకడిగా క్రియేట్ చేసి క్లైమాక్స్ ని జైలు లో ఫైట్ సీన్ గా పెట్టేద్దామని చెప్పడంతో పూరి జగన్నాథ్ కి ఆ సీన్ బాగా నచ్చి దాన్నే తెరకెక్కించారు. ఇక మొత్తానికైతే ఈ ఎంటైర్ సినిమాకి ఆ క్లైమాక్స్ సీన్ మాత్రం ఊపిరి పోసిందనే చెప్పాలి. దాన్ని ఒక్కదాన్ని మినహాయిస్తే సినిమాలో పెద్దగా స్టోరీ అయితే ఏమీ ఉండదు. చివరి 30 నిమిషాల సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించి సినిమా భారాన్ని భుజాల పైన మోసాడనే చెప్పాలి.

ఇక ఈ సినిమాతో పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కి కూడా సక్సెస్ ఇచ్చాడు. అప్పటివరకు స్టార్ హీరోలందరికి సక్సెస్ లను ఇచ్చిన పూరి ఎన్టీఆర్ కి మాత్రం ‘ ఆంధ్రావాలా ‘ తో ఒక భారీ డిజాస్టర్ ను ఇచ్చాడు. కానీ ‘టెంపర్ ‘ సినిమాతో సక్సెస్ ఇచ్చి ఎన్టీయార్ అభిమానులను కూడా సంతోషపరిచాడు…