Spirit: తెలుగు సినిమా స్థాయి అనేది ప్రస్తుతానికి ఇండియా దాటి ముందుకు సాగుతుంది. నిజానికి తెలుగు సినిమా అంటే ఒకప్పుడు తెలుగుకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం దేశాన్ని దాటి ఇతర దేశాల్లో కూడా మన సినిమా స్థాయి ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాయి. దాంతో మన తెలుగు సినిమాల్లో నటించడానికి హాలీవుడ్ స్టార్స్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రీసెంట్ గా పుష్ప 2 సినిమా కోసం ఒక సౌత్ కొరియన్ యాక్టర్ ను సినిమాలో తీసుకోవాలని ప్రణాళికలు రూపొందించారు.
కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక పుష్ప 2 సినిమా మీద రకరకాల వార్తలైతే బయటకు వస్తున్నాయి. కొంతమంది ఈ సినిమా మీద అల్లు అర్జున్ అంత సాటిస్ఫై అవ్వడం లేదు అంటూ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇక సుకుమార్ సైతం తను చెప్పింది ఏమి జరగడం లేదు అంటూ సెట్ నుంచి మైక్ పగలగొట్టేసి బయటికి వెళ్లిపోయాడు అంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి. ఫహాద్ ఫాజిల్ కు అసలు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా సినిమా షూటింగ్ కి వస్తున్నాడు అనే వార్తలైతే ప్రతిరోజు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమాను అందుకే ఒక ఆరు నెలల పాటు పోస్ట్ పోన్ చేశారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తానికైతే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే సౌత్ కొరియన్ విలన్ ను ఈ సినిమాలో తీసుకోవడం లేదు అనే స్పష్టత అయితే మేకర్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో చేస్తున్న ‘స్పిరిట్ ‘ సినిమా కోసం సౌత్ కొరియర్ విలన్ ను తీసుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీని ద్వారా అటు చైనాలోనూ స్పిరిట్ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేస్తే కలెక్షన్లు భారీ రేంజ్ లో వస్తాయనే ఉద్దేశ్యం తోనే ఆయన ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటికే బాహుబలి తో రాజమౌళి, కల్కితో నాగ్ అశ్విన్ భారీ సక్సెస్ లను అందుకున్నారు.
దాంతో స్పిరిట్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా కూడా ఒక భారీ సక్సెస్ కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కలెక్షన్ల వర్షం కురిపించాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే మన మేకర్స్ అసలు ఎక్కడ తగ్గకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా ప్రపంచ పటంలో తెలుగు సినిమానే టాప్ లెవల్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నానికి మనందరం సహకరిస్తే సరిపోతుంది అంటూ మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…