https://oktelugu.com/

NTR: దేవర విషయం లో ఎన్టీయార్ కల నెరవేరుతుందా..? ఆ ఒక్కటి సాధించి స్టార్ హీరోగా మారుతాడా..?

టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్న ప్రతి ఒక్క హీరోకి ఇండస్ట్రీ హిట్ ఉంది. కానీ ఎన్టీఆర్ కి మాత్రం అది ఇప్పటి వరకు దక్కలేదు. మరి దేవర సినిమాతో 2000 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ కొడుతాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Written By: , Updated On : April 16, 2024 / 05:08 PM IST
NTR

NTR

Follow us on

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన “యంగ్ టైగర్ ఎన్టీఆర్” ప్రస్తుతం విభిన్న తరహా చిత్రాలను ఎంచుకుంటూ వైవిధ్యమైన నటనని కనబరుస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ జనరేషన్ హీరోలలో నటించి మెప్పించగలిగే సత్తా ఉన్నటులు ఎవరూ లేకపోవడం విశేషం..

ఇక ఆయన ఒక పాత్రలో నటిస్తున్నాడు అంటే ఆ పాత్ర లో 100% ఎఫర్ట్ పెట్టి తనదైన రీతిలో నటించి మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంటూ ఉంటాడు. అందువల్లే ఎన్టీఆర్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లోకి ఎంట్రి ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఆయనకి ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్టు లేకపోవడం బాధాకరమైన విషయం అనే చెప్పాలి.

ఇక టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్న ప్రతి ఒక్క హీరోకి ఇండస్ట్రీ హిట్ ఉంది. కానీ ఎన్టీఆర్ కి మాత్రం అది ఇప్పటి వరకు దక్కలేదు. మరి దేవర సినిమాతో 2000 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ కొడుతాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక నిజానికి ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో అంత పెద్ద మార్కెట్ అయితే లేదు.

త్రిబుల్ ఆర్ సినిమాతో ఎంతో కొంత మార్కెట్ అయితే దక్కించుకున్నప్పటికీ ఆ సినిమాలో ఇద్దరు హీరోలు ఉండటం వల్ల ఎన్టీయార్ కంటే రామ్ చరణ్ కి ఎక్కువ గుర్తింపు లభించింది. కాబట్టి దేవర సినిమా బాలీవుడ్ లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ దక్కించుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక దాంతో పాటుగా బాలీవుడ్ లో వార్ 2 సినిమకూడ చేస్తున్నాడు…