Devara: దేవర లో ఎన్టీయార్ పాత్ర చనిపోతుందా..ఇదేం ట్విస్ట్ సామి…

సినిమా యాక్షన్ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రతి ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకుంది.

Written By: Gopi, Updated On : May 15, 2024 4:30 pm

Devara

Follow us on

Devara: నందమూరి ఫ్యామిలీ నుంచి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి తర్వాత ఇండస్ట్రీ కి వచ్చిన బాలయ్య బాబు ఇండస్ట్రీలో చాలా కాలం పాటు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక వీళ్ల తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన వరుస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

ఇక అందులో భాగంగానే దేవర సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ వస్తుందని ఈ సినిమా మీదనే ఎన్టీయార్ భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఇక దర్శకుడు కొరటాల శివ కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోవడంతో పాటు ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దేవర సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చనిపోతుంది అనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి దీంట్లో ఎన్టీయార్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి ఏజ్డ్ పర్సన్ క్యారెక్టర్ కాగా, ఇంకోటి యంగ్ ఎన్టీఆర్ రోల్ అయితే చేస్తున్నాడు.

ఇక అందులో ఏజ్డ్ పర్సన్ లో ఉన్న క్యారెక్టర్ చనిపోతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దీని మీద సినిమా యూనిట్ ఇప్పటి వరకైతే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. కానీ ఈ సినిమా నుంచి లీకైన స్టోరీని బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ చనిపోతాడనే వార్తలైతే వస్తున్నాయి. మరి బయట నడుస్తున్న ప్రచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ సినిమాలో చనిపోతాడా లేదంటే ఇద్దరు ఎన్టీఆర్ లు కూడా బతికే ఉంటారా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే..

ఈ సినిమా యాక్షన్ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రతి ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక దాంతో పాటుగా తొందర్లోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ కూడా బయటికి రాబోతుంది…