Raai Laxmi: స్విమ్ సూట్ లో జలకాలాడుతూ వేసవి తాపం తీర్చుకుంటున్న లక్ష్మి రాయ్… వైరల్ గా మైండ్ బ్లోయింగ్ లుక్

ఒకరిద్దరు ఇతర క్రికెటర్స్, బిజినెస్ మెన్ తో కూడా లక్ష్మీ రాయ్ ఎఫైర్స్ పెట్టుకున్నారనే వాదన ఉంది. ఈ మధ్య కెరీర్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. గత ఏడాది భోలా టైటిల్ తో ఒక హిందీ చిత్రం చేసింది.

Written By: S Reddy, Updated On : May 15, 2024 4:43 pm

Raai Laxmi

Follow us on

Raai Laxmi: హీరోయిన్ లక్ష్మీ రాయ్ స్విమ్ సూట్ లో జలకాలాడుతున్న ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. బెంగుళూరు భామ లక్ష్మీ రాయ్ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. అనంతరం నటిగా మారింది. ఈ పొడుగు భామ కర్క కాసాడ్ర తమిళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. రెండో మూవీతోనే టాలీవుడ్ లో అడుగుపెట్టింది. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంలో లక్ష్మీ రాయ్ హీరోయిన్ గా నటించింది. కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంలో లక్ష్మీ రాయ్ గ్లామర్ అదుర్స్ అని చెప్పాలి.

అయితే కాంచనమాల కేబుల్ టీవీ మూవీ అంతగా ఆడలేదు. అనంతరం నీకు నాకు టైటిల్ తో ఒక చిత్రం చేసింది. అది కూడా ప్లాప్ అయ్యింది. తెలుగులో లక్ష్మీ రాయ్ కి ఆఫర్స్ రాలేదు. ఆమె ఎక్కువగా కన్నడ, తమిళ్, మలయాళం చిత్రాలు చేసింది. చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 చిత్రంలో ఓ ఐటెం సాంగ్ చేసింది. రత్తాలు రత్తాలు సాంగ్ లో చిరంజీవితో కలిసి స్టెప్స్ వేసింది.

అంతకు ముందు రవితేజ హిట్ మూవీలో బలుపు లో సైతం ఓ ఐటెం సాంగ్ చేసింది లక్ష్మీ రాయ్. మతిపోగోట్టే గ్లామర్ ఉన్నా కానీ లక్ష్మీ రాయ్ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఆమె టైర్ 2 హీరోయిన్స్ జాబితాలోనే ఉండిపోయింది. మరోవైపు అమ్మడుపై లెక్కకు మించిన ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా స్టార్ క్రికెటర్ ధోని-లక్ష్మీ రాయ్ మధ్య గట్టి ఎఫైర్ నడిచిందని అప్పుడు నేషనల్ మీడియా కోడై కూసింది.

ఒకరిద్దరు ఇతర క్రికెటర్స్, బిజినెస్ మెన్ తో కూడా లక్ష్మీ రాయ్ ఎఫైర్స్ పెట్టుకున్నారనే వాదన ఉంది. ఈ మధ్య కెరీర్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. గత ఏడాది భోలా టైటిల్ తో ఒక హిందీ చిత్రం చేసింది. డిజిటల్ సిరీస్ల మీద కూడా లక్ష్మీ రాయ్ ఫోకస్ పెడుతుంది. అటు సోషల్ మీడియా వేదికగా కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. సమ్మర్ కావడంతో జలకాలాడుతూ తాపం తీర్చుకుంటుంది. బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్న లక్ష్మీ రాయ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.