Viral Video : అమ్మమ్మ కోసం స్వర్గానికి నిచ్చెన వేసిన ఘనుడు.. వైరల్ వీడియో

తన అమ్మమ్మ కోరిక మేరకే తాను ఈ ప్రయత్నం చేసినట్లు ఆనందంగా చెబుతాడు కియాంగ్. 1957లో జన్మించిన ఈయన.. ప్రస్తుతం న్యూయార్క్ లో నివాసముంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Written By: NARESH, Updated On : May 15, 2024 4:26 pm

A man who built a ladder to heaven for his grandmother.. Viral video

Follow us on

Viral Video : ‘ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కలు పట్టుకొని అడిగాను’ అంటూ ఏఎన్ఆర్ పాడే పాట ఇది. ప్రేయసి కోసం వర్ణిస్తూ ఏఎన్ఆర్ అలా పాట పాడారు. ప్రేయసిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. అయితే ఓ ఆర్టిస్ట్ అయితే తన వారి కోసం ఆకాశానికి నిచ్చెన వేశాడు. అయితే అది ఎలా సాధ్యమైంది అన్నది కదా మీ ప్రశ్న? ఆయన వేసింది నిప్పుల నిచ్చెన. మరి అదేంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. తెలుసుకోవాలంటే దీనిని చదివేయండి.

మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదు. ఈ కంప్యూటర్ యుగంలో ప్రతిదీ సాధ్యమేనని రుజువు చేశాడు చైనాకు చెందిన కాయ్ గువ్వొ కియాంగ్ అనే ఆర్టిస్ట్. ఏకంగా ఆకాశంలోనే ఈ అద్భుతం సృష్టించాడు. నిప్పులు కక్కుకుంటూ ఆకాశానికి ఎగబాకుతున్న నిచ్చెన తయారుచేసి యావత్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. ఆ వీడియోలో ఆకాశం వైపు నిప్పులతో దూసుకుపోతున్న నిచ్చెనను చూడొచ్చు. స్వర్గానికి మెట్ల మార్గం అనే క్యాప్షన్ తో ఆరోరా బొరియాలిస్ అనే చైనా ఆర్టిస్ట్ దీనిని తొలిసారిగా సృష్టించినట్లు ఓ వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో వీడియో షేర్ చేశాడు. అయితే ఆకాశానికి ఈ నిచ్చెన వేసిన అంశం వెనుక ఒక కథ ఉంది. ఇంతకీ ఆ పని ఎందుకు చేశాడంటే.. తన అమ్మమ్మ కోసమేనని తెలియడం మరింత ఆశ్చర్యకరం.

ఈ వీడియో పదేళ్ల కాలం కిందటి నాటిది. చైనీస్ బాణసంచా ఆర్టిస్ట్ కాయ్ గువో కియాంగ్ దీనిని రూపొందించాడు. ఆకాశంలో సుమారు అర కిలోమీటర్ ఎత్తు వరకు టపాసులను పేల్చుతూ రూపొందించాడు. రాగి తీగలు లోడ్ చేసిన గన్ పౌడర్ తో ఈ స్కై లెదర్ ను రూపొందించాడట. మూడో ప్రయత్నం గా సక్సెస్ అయ్యాడట. 1994లో బలమైన గాలులు వీయడంతో అతగాడి ప్రయోగం విఫలం అయింది. తరువాత 2001లో మరోసారి ప్రయత్నించాలని చూసినా.. అప్పట్లో ఉగ్రవాదుల దాడులు నేపథ్యంలో అధికారులు అనుమతి ఇవ్వలేదు. అటు తరువాత పదేళ్ల కిందట మూడోసారి ప్రయత్నించి సక్సెస్ అయ్యాడట. తన అమ్మమ్మ కోరిక మేరకే తాను ఈ ప్రయత్నం చేసినట్లు ఆనందంగా చెబుతాడు కియాంగ్. 1957లో జన్మించిన ఈయన.. ప్రస్తుతం న్యూయార్క్ లో నివాసముంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.