Indian 2 Vs Pushpa 2
Indian 2 Vs Pushpa 2: ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2 సినిమానే… ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక బాలీవుడ్ జనాలు అయితే ఈ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయిన సందర్భంగా బాలీవుడ్ లో ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ అయితే దక్కుతుంది.
మరి ఇలాంటి క్రమంలో పుష్ప 2 సినిమా ఎంతవరకు ప్రేక్షకులని మెప్పిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న శంకర్ కమలహాసన్ తో చేస్తున్న ఇండియన్ 2 సినిమాని పుష్ప 2 కి పోటీగా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసే పనిలో శంకర్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇంతకుముందు జూన్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తామంటూ కొన్ని డేట్స్ ని చెప్పినప్పటికీ, అప్పటి వరకు ఈ సినిమా వర్క్ మొత్తం పూర్తయ్యేటట్టుగా కనిపించడం లేదట. ఇక దాంతో ఆగస్టు 15 వరకు ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి పుష్ప లాంటి ఒక భారీ క్రేజ్ సంపాదించుకున్న సినిమాకి పోటీగా ఇండియన్ 2 సినిమా రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ సినిమా అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక నిజానికి పుష్ప 2 సినిమాతో కనుక ఇండియన్ 2 సినిమా రిలీజ్ అయితే ఈ సినిమాకి భారీ దెబ్బ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక పుష్ప మీద ఉన్న ఎక్కువ అంచనాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది పుష్ప సినిమాను చూడడానికి ఇష్టపడతారు. ఇక పుష్ప 2 సినిమా కనక పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్లైతే ఇండియన్ 2 సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా అంత పెద్దగా మ్యాజిక్ అయితే చేయలేదు అనేది వాస్తవం..
ఇక ఈ సందర్భంగా శంకర్ ఎందుకు ఈ సినిమాని అదే డేట్ లో తీసుకురావాలని నిర్ణయించాడు అనే విషయం మీద ఎవరికి క్లారిటీ లేదు. ఇక మొత్తానికైతే ఈ సినిమా డేట్ ని పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని లేకపోతే ఇండియన్ 2 సినిమాకి భారీ దెబ్బ పడుతుందని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…