https://oktelugu.com/

Kachidi Fish: గంగమ్మ తల్లి గట్టిగా దీవించింది.. లక్ష్మీదేవిని ఇంటికి పంపింది.. జాలరి జీవితం దెబ్బకు మారిపోయింది

కృష్ణాజిల్లా మత్స్యకారుడికి అంతర్వేది సముద్రతీరంలో అరుదైన చేపలు చిక్కాయ్. ఈ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే జాలర్లు గంగమ్మ తల్లికి మొక్కుకొని వెళ్తుంటారు. సముద్రంలో ఒడుపుగా వల విసురుతుంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 14, 2024 / 02:44 PM IST

    Kachidi Fish

    Follow us on

    Kachidi Fish: ఆ జాలరి యుక్త వయసు వచ్చినప్పటి నుంచి సముద్ర తీరంలో వేటకు వెళ్తూనే ఉన్నాడు. రోజుల పాటు వేటకు వెళ్లడం.. వచ్చిన చేపల్ని అమ్మడం.. అన్ని ఖర్చులు పోనూ ఎంతోకొంత వెనకేసుకోవడం.. జీవితమంతా ఇలానే సాగిపోతోంది. భారీగా సంపాదించింది లేదు.. గొప్పగా బతుకుతున్నదీ లేదు. మరి అతడి మొరనును గంగమ్మ తల్లి ఆలకించినట్టుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత అతడి ఇంట్లో లక్ష్మీదేవితో తాండవం చేయించాలని భావించినట్టుంది. అందుకే అతని ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చింది. అది కూడా మామూలుగా కాదు.. అతడి దారిద్ర్యం మొత్తం ఒక్కసారి పోయేలాగా వరాలు కురిపించింది. దీంతో ఆ జాలరి ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

    కృష్ణాజిల్లా మత్స్యకారుడికి అంతర్వేది సముద్రతీరంలో అరుదైన చేపలు చిక్కాయ్. ఈ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే జాలర్లు గంగమ్మ తల్లికి మొక్కుకొని వెళ్తుంటారు. సముద్రంలో ఒడుపుగా వల విసురుతుంటారు. అలా తన వలకు ఏదో బరువైన చేప తగిలిందని భావించి ఆ జాలరి సహచరులతో కలిసి మెల్లగా ఇవతలకి లాగాడు. బయటికి లాగి చూడగానే ఆ వలలో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటున్నాయి కచిడి చేపలు. వీటిని జాలర్లు వారి పరిభాషలో గోల్డ్ ఫిష్ అని పిలుస్తుంటారు. అలా ఆ జాలరి వలకు రెండు కచిడి చేపలు చిక్కాయి.

    ఈ చేపలను కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో వేలం వేస్తే.. ఒక వ్యాపారి నాలుగు లక్షలకు కొన్నాడు. దీంతో ఆ జాలరి ఆనందంతో ఎగిరి గంతేస్తున్నాడు. ఆ జాలరి వలకు చిక్కిన కచిడి చేప ఉదర భాగంలో ఔషధ గుణాలు ఉంటాయట. ఈ చేప శరీర భాగాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారట. ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీలో ఈ చేప అంటే హాట్ కేక్ లాంటిది. అందుకే దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీనిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడుతుంటారు. ఆపరేషన్ తర్వాత డాక్టర్లు కుట్లు వేసే దారాన్ని ఈ చేపల నుంచే తయారు చేస్తారు. ఈ చేప పొట్ట భాగంలో లభించే వివిధ రకాలైన భాగాల నుంచి ఆ దారం తయారు చేస్తారు. ఆ దారం ప్రత్యేకత ఏంటంటే.. గాయానికి కుట్లు వేయగానే.. కొంతకాలానికి శరీరంలో కలిసిపోతుంది. ఇక ఇలాంటి చేపలు తమ వలకు ఒక్కసారైనా చిక్కాలని మత్స్యకారులు కోరుకుంటారు. గంగమ్మ తల్లిని గట్టిగా మొక్కుకున్న ఆ జాలరిని కరుణించింది. గోల్డ్ ఫిష్ రూపంలో లక్ష్మీదేవిని అతడి ఇంటికి పంపించింది. దీంతో ఆ జాలరి ఆనందానికి అవధులు లేవు.