Anirudh Ravichander: తెలుగు లో అనిరుధ్ కూడా మరో హరీష్ జైరాజ్ కానున్నాడా..?

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి సంబంధించిన ఎమోషన్స్ ను చాలావరకు హై లెవెల్లో చూపించాయి. అయినప్పటికీ ఈ సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల హరీష్ జైరాజ్ ను తెలుగులో ఐరన్ లెగ్ గా ముద్ర వేశారు.

Written By: Gopi, Updated On : June 23, 2024 1:48 pm

Anirudh Ravichander

Follow us on

Anirudh Ravichander: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే మ్యూజిక్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఇక ఆ సినిమా సాంగ్స్ కనక ప్రేక్షకులను మెప్పించినట్టైతే సినిమాతో సంబంధం లేకుండా ఆ సాంగ్స్ ను చూడడానికైనా ప్రేక్షకులు థియేటర్ కి వస్తుంటారు. కాబట్టి అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసే మ్యూజిక్ విషయంలో డైరెక్టర్లు ఆచితూచి మరి కొంతమంది మ్యూజిక్ డైరెక్టలను ఏరికోరి తీసుకుంటున్నారు.

ఇక అందులో భాగంగానే వాళ్లు తమ సాయశక్తుల కష్టపడి మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఆయా సినిమాల్లో మ్యూజిక్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఆ సినిమాలు కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాయి. ఇక దానికి కారణం సినిమా కంటెంట్ లో లోపం ఉండటం వల్ల అలా జరుగుతుంది. కానీ సినిమా సక్సెస్ కాకపోయిన కూడా మ్యూజిక్ డైరెక్టర్లకి భారీ దెబ్బ పడుతుంది. ఇక ఈ విషయానికి వస్తే తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన హరీష్ జైరాజ్ సూపర్ డూపర్ సక్సెస్ లని అందుకున్నాడు. ఇక అదే ఉద్దేశ్యంతో తెలుగులో కూడా ఆయన్ని కొన్ని సినిమాల కోసం తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఘర్షణ, సైనికుడు, మున్నా , ఆరెంజ్ లాంటి సినిమాలకి ఆయన సంగీత దర్శకుడి గా వ్యవహరించాడు.

ఇక ఈ సినిమాలన్నింటిలో కూడా సాంగ్స్ సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి సంబంధించిన ఎమోషన్స్ ను చాలావరకు హై లెవెల్లో చూపించాయి. అయినప్పటికీ ఈ సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల హరీష్ జైరాజ్ ను తెలుగులో ఐరన్ లెగ్ గా ముద్ర వేశారు. ఇక ఆయన్ని ఆతర్వాత తెలుగు సినిమాల్లోకి తీసుకోవడం కూడా మానేశారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న అనిరుధ్ కూడా తన మ్యూజిక్ తో ప్రపంచం మొత్తాన్ని తన వైపు చూసేలా చేస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఆయన ఇంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేశాడు.

ఇక ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నప్పటికీ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. అందువల్ల ఆయనకు రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. ఇక ఇప్పుడు మరోసారి దేవర సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇక ఇది కనక తేడా కొడితే తెలుగులో ఆయన ఫ్యూచర్ కూడా హరీష్ జైరాజ్ మాదిరిగానే మారబోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా అయితే ఆయనకి తెలుగులో ఆఫర్లు వస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.