Vikram: విక్రమ్ సినిమాలకే ఎందుకు ఇలా జరుగుతుంది.. వెరీ బ్యాడ్ న్యూస్…

గత నాలుగైదు సంవత్సరాల కిందటే షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కావాల్సిన 'ధ్రువ నక్షత్రం' సినిమా ఇప్పటివరకూ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇక ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్లను అనౌన్స్ చేస్తున్నప్పటికీ ఈ సినిమా రిలీజ్ కి మాత్రం ఏదో ఒక అడ్డంకి అయితే ఎదురవుతుంది.

Written By: Gopi, Updated On : May 19, 2024 2:29 pm

Vikram

Follow us on

Vikram: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విక్రమ్… ఈయన చేసినటువంటి వైవిధ్యమైన పాత్రలను ఇండస్ట్రీలో ఉన్న మరే హీరోకూడ చేయలేడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈయన సినిమాల మీద సినిమాలను చేస్తున్నాడు గానీ ఇప్పటివరకు ఆ సినిమాలు మాత్రం రిలీజ్ కాకుండా అలాగే ఉండిపోతున్నాయి.

గత నాలుగైదు సంవత్సరాల కిందటే షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కావాల్సిన ‘ధ్రువ నక్షత్రం’ సినిమా ఇప్పటివరకూ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇక ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్లను అనౌన్స్ చేస్తున్నప్పటికీ ఈ సినిమా రిలీజ్ కి మాత్రం ఏదో ఒక అడ్డంకి అయితే ఎదురవుతుంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన పా రంజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ‘తంగలన్’ సినిమా కూడా ఇప్పటికెప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ ఆ సినిమా కూడా అనుకోని కారణాలవల్ల లేట్ అవుతూ వస్తుంది. మరి ఇలాంటి క్రమంలో విక్రమ్ సినిమాలకే ఇలాంటి ఇబ్బందులు ఎందుకు ఎదురవుతున్నాయని అతని అభిమానులు కూడా చాలా వరకు బాధపడుతున్నారు.

ఇక ఒకప్పుడు విక్రమ్ శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ లాంటి సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్లను పోషించి మంచి పేరునైతే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటికి కూడా ఆయనంటే తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరూ ఆయన సినిమాలు చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి ఈ సినిమాల రిలీజ్ డేట్లు ఎప్పుడో ఇంకా సినిమా మేకర్స్ అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు.

మరి ఈ సినిమాలు రిలీజ్ అవుతాయా, అవ్వవా అనే దాని మీద ఒక క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…ఇక విక్రమ్ ఈ సినిమాలు రిలీజ్ అవ్వకపోయిన కూడా తను తగ్గేదెలే అన్నట్టుగా మరికొన్ని సినిమాలను చేస్తూ ముందుకు కదులుతున్నాడు… ఈ సినిమాలు రిలీజ్ అయితే విక్రమ్ మార్కెట్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి..