https://oktelugu.com/

NTR: ఎన్టీయార్ కి పోటీ గా రాబోతున్న సూర్య…తారక్ ను తట్టుకుంటాడా..?

శివ డైరెక్షన్ లో కంగువ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియాలో ఉన్న రికార్డులన్నింటిని తిరగరాయాలని తను కూడా చాలా గట్టి ప్రయత్నమైతే చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు కూడా ఒకే టైమ్ లో రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : May 19, 2024 / 02:26 PM IST

    NTR

    Follow us on

    NTR: నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆయన దేవర అనే సినిమాతో ఇండియా లో ఉన్న రికార్డులన్నింటిని బ్రేక్ చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఎన్టీయార్.

    ఈ సినిమాతో తన సత్తా ఏంటో మరోసారి చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అయిన సూర్య కూడా తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈయన శివ డైరెక్షన్ లో కంగువ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియాలో ఉన్న రికార్డులన్నింటిని తిరగరాయాలని తను కూడా చాలా గట్టి ప్రయత్నమైతే చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు కూడా ఒకే టైమ్ లో రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

    మరి అలా రిలీజ్ అయితే ఏ సినిమా కి ప్లస్ అవుతుంది, అది ఏ సినిమాకి మైనస్ గా మారనుంది అనే విషయాలను పక్కన పెడితే రెండు కూడా పెద్ద సినిమాలే కాబట్టి రెండు సినిమాలకి మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు వారం గ్యాప్ లో కనక పోటీపడ్డ కూడా ఈ సినిమాలకి కొంచెం నష్టం అయితే జరుగుతుంది.

    ఇక నిజానికి ఎన్టీఆర్ కి ఉన్న మార్కెట్ సూర్యకి లేదు. ఇప్పటి వరకు సూర్య ఒక్కటి కూడా పాన్ ఇండియా సినిమా చేయలేదు. ఆయనకి తమిళ్ తెలుగులో మాత్రమే మంచి మార్కెట్ ఉంది. ఇక ఇండియా వైడ్ గా మార్కెట్ అయితే ఉంది. కాబట్టి దేవర సినిమాతో భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ సినిమాతో పోటీపడి రిలీజ్ అయితే అది సూర్య సినిమాకి మైనస్ అయ్యే అవకాశం అయితే ఉంది…