Kannappa: మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు తన ఎంటైర్ కెరియర్లో ఢీ సినిమాని మినహాయిస్తే ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ సినిమా మరొకటి లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన ఎలాగైనా సక్సెస్ సాధించాలనే ఉద్దేశ్యం తో కన్నప్ప సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక దాదాపు ఈ సినిమా కోసం 150 కోట్ల బడ్జెట్ ని కేటాయించి ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక అందులో భాగంగానే మంచు విష్ణు కన్నప్ప పాత్ర పోషిస్తుంటే శివుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక మొన్నటిదాకా ప్రభాస్ శివుడి క్యారెక్టర్ పోషిస్తున్నాడు అనే వార్తలు వినిపించాయి. ఇక మధ్యలో అక్షయ్ కుమార్ ఆ పాత్రను చేస్తున్నాడు అంటూ వార్తలైతే వచ్చాయి. ఇక రీసెంట్ గా ఆయన ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని షూటింగ్ పార్ట్ మొత్తాన్ని ముగించేశాడు అనే విషయాన్ని అఫీషియల్ గా విష్ణు తెలియజేశాడు.
మరి ఇలాంటి క్రమంలోనే ఆయన పోషిస్తున్న పాత్ర శివుడి క్యారెక్టరేనా లేదంటే వేరేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు అనే వార్తలు ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయి.ఇక అక్షయ్ కుమార్ చేసిన పాత్ర ఏంటి అనే దానిమీద సస్పెన్స్ ఉంది కాబట్టి శివుడి పాత్రను ఎవరు పోషిస్తున్నారు అనేది ఇంకా క్లారిటీగా తెలియడం లేదు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే శివుడి పాత్రను ప్రభాస్ తోనే చేయించే ఉద్దేశ్యం లో మంచు విష్ణు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అక్షయ్ కుమార్ చేసిన పాత్ర ఏంటంటే ఈ సినిమాలో మంచు విష్ణు కి గురువుగా అక్షయ్ కుమార్ నటించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటన్నింటికీ క్లారిటీ రావాలంటే మంచు విష్ణు ఈ సినిమా మీద స్పందించి వివరణ ఇస్తే తప్ప సరైన క్లారిటీ అయితే రాదు…