https://oktelugu.com/

Tollywood: ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమా సూపర్ హిట్ అయిందంటే..?

సోమవారం నుంచి ఏ సినిమా అయితే కన్సిస్టెంట్ గా కలెక్షన్స్ ని వసూలు చేస్తూ ఉంటుందో ఆ సినిమాకే మంచి పేరుతో పాటు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

Written By:
  • Gopi
  • , Updated On : June 2, 2024 / 10:07 AM IST

    Tollywood

    Follow us on

    Tollywood: సినిమా ఇండస్ట్రీలో ప్రతి వారం కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి క్రమంలోనే ఈవారం కూడా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ఒకటి. ఇక కార్తికేయ హీరోగా వచ్చిన ‘భజే వాయువేగం’ సినిమా మరొకటి. విజయ్ దేవరకొండ తమ్ముడు అయిన ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘గం గం గణేశా’ సినిమా ఇంకొకటి..అయితే ఈ వారం రిలీజ్ అయిన ఈ మూడు సినిమాల్లో ఇప్పటివరకైతే మూడింటికి మంచి ఓపెనింగ్స్ దక్కినప్పటికీ వీటిలో ఏ సినిమా మంచి విజయాన్ని సాధించింది అనేది తెలియాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే…

    సోమవారం నుంచి ఏ సినిమా అయితే కన్సిస్టెంట్ గా కలెక్షన్స్ ని వసూలు చేస్తూ ఉంటుందో ఆ సినిమాకే మంచి పేరుతో పాటు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక మొత్తానికైతే ఈ సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ అయ్యిందో తెలియాలంటే మరొక రెండు మూడు రోజులపాటు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటికైతే విశ్వక్ సేన్ హీరో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చి సినిమా సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తుంది.

    ఈ సినిమాతో విశ్వక్ సేన్ మరొకసారి తన ఫామ్ ను కొనసాగించే విధంగానే కనిపిస్తున్నాడు. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే ‘గామి ‘ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు ఈ సినిమాతో కూడా మరోసారి డిఫరెంట్ అటెంప్ట్ చేయడమే కాకుండా మాస్ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు.

    ఇక దానికి తగ్గట్టుగానే మాస్ ఆడియన్స్ లో విపరితమైన అంచనాలను పెంచుతూ వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ అయితే దక్కుతుంది. ఇక మూడు రోజులు ఆగితే గాని ఏ సినిమా భవితవ్యం ఏంటి అనేది తెలియదు…చూడాలి మరి ఈ సినిమాల్లో ఏ సినిమా భారీ సక్సెస్ అందుకుంటుంది అనేది…