https://oktelugu.com/

Tollywood Heroes: పౌరాణికాల్లో ఉన్న ఈ మూడు పాత్రలను పోషించే సత్తా ఉన్న తెలుగు హీరోలు వీళ్లే…

ఎలాంటి పాత్రనైనా పోషించే కెపాసిటీ కొంత మంది నటులకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు తప్ప ఆ పాత్రలను ఎవ్వరు చేసిన చూడలేం..ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు కూడా ప్రత్యేకంగా కొన్ని పాత్రలను కొంత మంది హీరోల కోసం డిజైన్ చేసుకుంటూ ఉంటారు. మరి ఆ పాత్రలను ఆ హీరోలు చేస్తే పర్లేదు కానీ లేకపోతే ఆ డైరెక్టర్స్ ఆ పాత్రలను వేరే హీరోలతో చేస్తే చేస్తారు. లేదంటే ఆ కథలను అలాగే పక్కన పడేస్తారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 23, 2024 9:57 am
    Tollywood Heroes

    Tollywood Heroes

    Follow us on

    Tollywood Heroes: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ కొన్ని పాత్రలను కొందరు మాత్రమే పోషించగలరు. మిగతా నటులు ఆ పాత్రను చేసిన కూడా ప్రేక్షకులు ఆయా పాత్రల్లో వాళ్ళను ఊహించుకోవడం కొంతవరకు కష్టమనే చెప్పాలి. మరి ఇలాంటి క్రమంలోనే కొంతమంది కావాలని కూడా వాళ్ల కోసం ఆ క్యారెక్టర్లను రాయించుకుని సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక అలాంటి సందర్భంలో తప్పనిసరిగా ఆ పాత్రలో వాళ్ళని మనం చచ్చినట్టు చూడాల్సిందే. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు కూడా ప్రత్యేకంగా కొన్ని పాత్రలను కొంత మంది హీరోల కోసం డిజైన్ చేసుకుంటూ ఉంటారు. మరి ఆ పాత్రలను ఆ హీరోలు చేస్తే పర్లేదు కానీ లేకపోతే ఆ డైరెక్టర్స్ ఆ పాత్రలను వేరే హీరోలతో చేస్తే చేస్తారు. లేదంటే ఆ కథలను అలాగే పక్కన పడేస్తారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొన్ని క్యారెక్టర్లను చేయాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోల వల్లనే అవుతుంది. వాళ్ళు ఎవరు ఆ పాత్రలు ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం… మహాభారతంలోని శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు లాంటి పాత్రలను పోషించాలి అంటే అది ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది హీరోలకు మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళు ఎవరు అంటే కృష్ణుడు పాత్రను పోషించాలంటే మహేష్ బాబు అయితే ఆ పాత్రకి చాలా వరకు న్యాయం చేస్తాడు.

    ఎందుకంటే ఆయన చూడ్డానికి కూడా చాలా సాఫ్ట్ గా కృష్ణుడు మాదిరిగానే ఉంటాడు. కాబట్టి ఆయన ఆ పాత్రకి 100% న్యాయం చేయగలాగుతాడు. ఇక మొత్తానికైతే కృష్ణ పాత్ర ను తను తప్ప ఎవ్వరూ చేసిన కూడా అంత బాగా సెట్ అవ్వదు…ఇక దుర్యోధనుడి పాత్ర పోషించాలంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్లనే అవుతుంది. ఎందుకంటే ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా చాలా బాగా పోషిస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు.

    ఇక ఇంతకు ముందు జై లవకుశ, టెంపర్ సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్లలో నటించి మెప్పించాడు. కాబట్టి ఈ పాత్ర చేయాలి అంటే అది కేవలం ఆయన వల్ల మాత్రమే అవుతుంది…ఇక అర్జునుడి పాత్ర చేయాలంటే అది కేవలం రామ్ చరణ్ వల్లే అవుతుంది. ఆయన బాడీ గాని, ఆ కటౌట్ గాని చూస్తే ఆయన పక్కగా అర్జునుడి క్యారెక్టర్ కి సెట్ అవుతాడు అనిపిస్తుంది. ఇక ఇంతకు ముందు ‘ త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో నటించడంతో బాలీవుడ్ వాళ్లు దానిని రాముడు పాత్రగా భావించారు. దాంతో ఆ పాత్ర వేసినందుకు రామ్ చరణ్ కి మంచి గుర్తింపు వచ్చింది.

    ఇక దాంతో పాటుగా రామ్ చరణ్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా కూడా ఎదిగాడు. ఇక మొత్తానికైతే పౌరాణికాల్లో ఉన్న ఈ మూడు పాత్రలను పోషించాలంటే ఈ ముగ్గురు హీరోల వల్ల తప్ప మరే హీరో వల్ల అవ్వదు అనేది మాత్రం చాలా కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ముగ్గురిలో పౌరాణికానికి సంబంధించిన భావాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వాళ్ళు పౌరాణికాల పట్ల చూపించే ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మూడు పాత్రలను పోషించడంలో వీళ్ళు ముగ్గురు పర్ఫెక్ట్ ఛాయిస్ అనే చెప్పాలి. చూడాలి మరి ఈ పాత్రలను పోషించే టైమ్ వీళ్ళకి ఎప్పుడు వస్తుంది అనేది…