Double Ismart Teaser: డబుల్ ఇస్మార్ట్ టీజర్ లో ఏముంది..? అంత రోటీన్ రొట్టే కదా…

ఒకటి రెండు డైలాగులను మినహాయిస్తే ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగా వైవిధ్యం కూడా ఏమీ లేనట్టుగా టీజర్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక టీజర్ మొత్తం మాఫియా బ్యాక్ డ్రాప్ లో తిరిగే కథగానే మనకు కనిపిస్తుంది.

Written By: Gopi, Updated On : May 15, 2024 4:21 pm

Double Ismart Teaser

Follow us on

Double Ismart Teaser: ఒకప్పుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉండేవి. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాలను తీసి సూపర్ సక్సెస్ లుగా మలిచేవారు. కానీ కొన్ని రోజుల నుంచి పూరి జగన్నాథ్ సరైన సినిమాలు చేయడం లేదనే విమర్శలను అయితే ఎదుర్కొంటున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే 2019 లో ఆయన రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత విజయ్ తో చేసిన లైగర్ సినిమాతో భారీ దెబ్బ తిన్నాడు. ఇక ఆ ఫ్లాప్ నుంచి కోలుకోవడానికే ప్రస్తుతం రామ్ ను హీరో గా పెట్టి డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఈరోజు రామ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఈ టీజర్ ని కనక మనం చూసుకున్నట్లయితే ఇందులో పెద్దగా కొత్తదనం అయితే ఏమీ కనిపించడం లేదు. ఒకప్పుడు పూరీ జగన్నాథ్ ఎలాంటి సినిమాలు తీసేవాడో ఇది కూడా అలాంటి రొటీన్ రొట్ట ఫార్ములాలోనే ఈ సినిమా కూడా సాగినున్నట్టుగా తెలుస్తుంది.

ఒకటి రెండు డైలాగులను మినహాయిస్తే ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగా వైవిధ్యం కూడా ఏమీ లేనట్టుగా టీజర్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక టీజర్ మొత్తం మాఫియా బ్యాక్ డ్రాప్ లో తిరిగే కథగానే మనకు కనిపిస్తుంది. ఇక ఇంతకు ముందు పూరి జగన్నాథ్ చేసిన సినిమాలన్నీ కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీలే కావడం విశేషం…ఈ సినిమాలో కూడా అవే గన్స్, పంచ్ డైలాగ్స్ తప్ప మరే కొత్త అంశాన్ని ఐతే ఏమి చూపించట్లేదనే విషయం అయితే ఈ టీజర్ లోనే క్లియర్ కట్ గా అర్థం అవుతుంది.

మరి ఇప్పటికైనా పూరి జగన్నాథ్ మారి కొంచెం మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా ఆయన అభిమానులకు ఈ సినిమా మరి రొటీన్ రొట్ట ఫార్మలా లా సాగుతుందని తెలిసేసరికి పూరి అభిమానులు కొంతవరకు నిరాశ పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఈ సినిమా హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అనే విషయం క్లారిటీగా తెలియదు…