https://oktelugu.com/

Richa Pallad: నువ్వే కావాలి’హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

2016లో పెళ్లి తరువాత ‘మలుపు’ సినిమాలో కనిపించారు. అయితే ఆ తరువాత అవకాశాలు రాలేదు.ప్రస్తుతం రిచా భర్తకు సాయంగా వ్యాపారంలో తోడుగా ఉంటుంది. అయితే మిగతా హీరోయిన్ల లాగా రిచా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించాలని అనుకుంటోంది. కానీ ఆ అవకాశం వస్తుందో, లేదో చూడాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : April 7, 2024 / 04:29 PM IST

    Nuvve Kavari Herohine

    Follow us on

    Richa Pallad:  20వ దశంలో ఒక రేంజ్ లో సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్లిన హీరోయిన్లలో కొందరు పెళ్లిళ్లు చేసుకొని హాయిగా జీవిస్తున్నారు. మరికొందరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. 24 ఏళ్ల కిందట వచ్చిన ‘నువ్వే కావాలి’ సినిమా కొందరికి గుర్తుండే ఉంటుంది. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తరుణ్ తో పాటు రియా పల్లోడ్ ఫేమస్ అయ్యారు. ఇందులో నటించిన రిచా పల్లోడ్ ఇప్పుడు ఎలా ఉందంటే?

    కర్ణాటకకు చెందిన రిచా పల్లోడ్ బెంగుళూరులో 1980 ఆగస్టు 30న జన్మించారు. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరో వైపు 1991 లో ‘లమ్హే’ అనే సినిమాలో బాలనటిగా కనిపించారు. ఆ తరువాత 2000 సంవత్సంలో ‘నువ్వే కావాలి’ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు ఆమెకు ఉత్తమ తెలుగు నటిగా ఫిల్మ్ ఫెయిర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో తరుణ్ తో కలిసి నటించిన రిచా ఆ తరువాత మరోసారి ‘చిరుజల్లు’ కలిసి పనిచేశారు.

    కొంతకాల గ్యాప్ తీసుకున్న రిచా 2020లో ‘యువర్ హానర్’ అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించారు. అయితే ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు 2011లో హిమన్షు బజాజ్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు కూడా జన్మించారు. 2016లో పెళ్లి తరువాత ‘మలుపు’ సినిమాలో కనిపించారు. అయితే ఆ తరువాత అవకాశాలు రాలేదు.ప్రస్తుతం రిచా భర్తకు సాయంగా వ్యాపారంలో తోడుగా ఉంటుంది. అయితే మిగతా హీరోయిన్ల లాగా రిచా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించాలని అనుకుంటోంది. కానీ ఆ అవకాశం వస్తుందో, లేదో చూడాలి.