https://oktelugu.com/

Hitler: చిరంజీవి హిట్లర్ సినిమాకి రాజశేఖర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

చిరంజీవి స్టోరీ తెలిసిన చాలా మంది వివిధ రంగాల్లో కష్టపడి మరి సెటిల్ అయినట్టుగా ఆ వ్యక్తులు కొన్ని సందర్భాల్లో తెలియజేశారు...ఇక ఆయన ఈ పొజిషన్ లో ఉండడానికి ఎంత కష్టపడ్డాడు అనేది మనందరికీ తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : April 8, 2024 / 08:11 AM IST

    Hitler

    Follow us on

    Hitler: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 సంవత్సరాల పాటు మకుటం లేని మహారాజు గా ఏకచత్రాధిపత్యంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న ఒకే ఒక హీరో మెగాస్టార్ చిరంజీవి…ఈయన ఇండస్ట్రీకి రావడానికి ముందు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఎక్కడ కూడా హీరో అవ్వాలనే తన విశ్వాసాన్ని వదులుకోలేదు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఇక ఇప్పుడున్న చాలామంది యూత్ ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు చేయాల్సిన పనిని ధృడ సంకల్పం తో చేస్తూ ముందుకు సాగితే తప్పకుండా వాళ్లకు విజయం వరిస్తుంది.

    ఇక చిరంజీవి స్టోరీ తెలిసిన చాలా మంది వివిధ రంగాల్లో కష్టపడి మరి సెటిల్ అయినట్టుగా ఆ వ్యక్తులు కొన్ని సందర్భాల్లో తెలియజేశారు…ఇక ఆయన ఈ పొజిషన్ లో ఉండడానికి ఎంత కష్టపడ్డాడు అనేది మనందరికీ తెలిసిందే. ఇక చిరంజీవితో ఎప్పటికప్పుడు పోటీ పడుతూ మరి కొంతమంది హీరోలు కూడా ఆయన కంటే స్టార్ హీరోలుగా ఎదగాలనే ప్రయత్నం అయితే చేశారు. కానీ చిరంజీవి స్క్రిప్ట్ ల విషయంలో కానీ, నటన విషయంలో కానీ వైవిధ్యాన్ని ప్రదర్శించడం వల్లే జనాలు మిగతా హీరోల కంటే తనని ప్రత్యేకంగా చూడటం మొదలు పెట్టారు. అందుకే ఆయన మిగతా హీరోలు చేరుకోలేని ఒక గొప్ప పొజిషన్ కి చేరుకున్నారు.

    ఇక ఇదిలా ఉంటే సిస్టర్ సెంటిమెంట్ తో చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. అయితే ఈ సినిమా మలయాళం లో మమ్ముట్టి హీరో గా, శోభన హీరోయిన్ గా వచ్చిన ‘హిట్లర్’ సినిమాని అదే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమాని చిరంజీవి చేయాలని అనుకున్నప్పుడే హీరో రాజశేఖర్ కూడా ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ తో రీమేక్ రైట్స్ కొనుగోలు చేయాలనే ప్రయత్నం చేశాడట.

    కానీ అప్పటికే ప్రొడ్యూసర్ ‘ఎం.వి లక్ష్మి’ ఈ సినిమా రీమేక్ రైట్స్ ని కొని చిరంజీవి హీరోగా ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక రాజశేఖర్ ఈ సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ అది వీలు కాలేదు. అయితే రాజశేఖర్ కి సినిమాలే దొరకనట్టు చిరంజీవి చేయాలనుకున్న సినిమాలకే పోటీగా వస్తాడని చాలా మంది చిరంజీవి అభిమానులు ఆయన విషయం లో కొంత వరకు అసంతృప్తి ని వ్యక్తం చేస్తూ ఉంటారు…