Venkatesh: వెంకటేష్ చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల ఆయన నెంబర్ వన్ హీరో అవ్వలేకపోయారా..?

వెంకటేష్ చేసిన ఈ ఒక్క మిస్టేక్ వల్లే ఆయన నెంబర్ వన్ హీరోగా ఎదగలేకపోయాడు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి సినిమాలు చేయడం వల్ల ఇప్పటికీ మాత్రం ఆయనకు కొంతవరకు అన్యాయం అయితే జరిగిందని కొంత మంది చెబుతూ ఉంటారు.

Written By: Gopi, Updated On : April 8, 2024 8:05 am

Venkatesh

Follow us on

Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి ఉన్న స్థానం గురించి మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ లో తను ఒక చెరగని ముద్ర వేశాడనే చెప్పాలి. ఇక ఇప్పటికి వెంకటేష్ సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్ల బాట పడుతున్నారు అంటే అంతకుముందు ఆయన క్రియేట్ చేసుకున్న ఇంపాక్ట్ ఆయనకు ఇప్పటివరకు కూడా యూజ్ అవుతుందనే చెప్పాలి. ఇక వెంకటేష్ సినిమాల్లో ఎలాంటి వల్గారిటీ ఉండదు. ముఖ్యంగా ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేసే సినిమాలు చేస్తాడు కాబట్టి ఎమోషన్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. అందువల్లే ఆయన సినిమాలు చూసి ప్రేక్షకులు ఏడవడానికి కూడా రెడీగా ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ టాప్ ఫోర్ హీరోలలో ఒకరుగా మాత్రమే మిగిలాడు తప్ప నెంబర్ వన్ హీరోగా ఎదగలేకపోయాడు. దానికి కారణం ఏంటి అంటే వెంకటేష్ చేసే సినిమాలు అన్ని డ్రామా ను బేస్ చేసుకొని ఉంటాయి. ఆ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. కానీ ఇలాంటి సినిమాలకు యూత్ లో అంత ఇంపాక్ట్ ఉండదు. ఈయన సినిమాలను యూత్ ఒకసారి మాత్రమే చూసేవారు. ఎందుకంటే ఇంతటి మెలో డ్రామా సినిమాలు చూసినపుడు యూత్ ఎక్కువగా ఎంజాయ్ చేయలేరు. మాస్ సినిమాలు గాని,లేదంటే యాక్షన్ సినిమాలు అయితే యూత్ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు. దానివల్ల ఆ సినిమాకి రిపిటేడ్ ఆడియన్స్ వస్తూ ఉంటారు. అందువల్ల సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.

వెంకటేష్ చేసిన ఈ ఒక్క మిస్టేక్ వల్లే ఆయన నెంబర్ వన్ హీరోగా ఎదగలేకపోయాడు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి సినిమాలు చేయడం వల్ల ఇప్పటికీ మాత్రం ఆయనకు కొంతవరకు అన్యాయం అయితే జరిగిందని కొంత మంది చెబుతూ ఉంటారు. ఇక మొత్తానికైతే ఏదో ఒక కేటగిరి ఆడియన్స్ ని మాత్రం హోల్డ్ చేసి పెట్టుకున్నాడు అనే సంతోషాన్ని వెంకటేష్ అభిమానులు ఇప్పటికీ వ్యక్తం చేస్తూ ఉంటారు.

చిరంజీవి మెగాస్టార్ అయినప్పటికీ డాడీ లాంటి సినిమా చిరంజీవి చేస్తే ఆడియన్స్ చూడలేదు. అదే వెంకటేష్ చేస్తే చూసేవారు. కాబట్టి వెంకటేష్ చిరంజీవి లాగా స్టార్ హీరోగా ఎదగలేకపోయిన, చిరంజీవి అంత మార్కెట్ లేకపోయిన ఆయన సినిమాలను చూసే సపరేట్ ఆడియెన్స్ ఉండటం ఆయన సంపాదించుకున్న అభిమానం అనే చెప్పాలి…