Tollywood: కొంతమంది హీరోలు, డైరెక్టర్లు వాళ్ళు చేసిన సినిమాలను థియేటర్లో చూడకపోవడానికి కారణం ఏంటంటే..?

ఇలాంటి కొవ కు చేసిన వాళ్లలో పవన్ కళ్యాణ్ మొదటి వరుసలో ఉంటాడు. పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని సినిమాలను థియేటర్లో చూడలేదట. ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేయడం విశేషం...

Written By: Gopi, Updated On : March 18, 2024 12:19 pm

why some heroes and directors do not watch their films in theaters

Follow us on

Tollywood: చాలామంది హీరోలు, దర్శకులు వరుసగా సినిమాలను చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లు చేసిన సినిమాలను థియేటర్ లో చూసుకునే అంత టైం కూడా వాళ్ళకి ఉండదు. ఇక చాలా సందర్భాల్లో చాలా మంది దర్శకులు గానీ, హీరోలుగాని వాళ్ళు చేసిన సినిమాలు చూడకుండా మిస్ అయిపోయి ఉంటారు. ఇలాంటి కొవ కు చేసిన వాళ్లలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మొదటి వరుసలో ఉంటాడు. పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని సినిమాలను థియేటర్లో చూడలేదట. ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేయడం విశేషం…

ఇక ఇదిలా ఉంటే సక్సెస్ ఫుల్ రైటర్ గా తనకంటూ మంచి గుర్తింపుని సంపాదించుకున్న వక్కంతం వంశీ కూడా తను కథ అందించిన ఏజెంట్ సినిమాని ఇప్పటివరకు చూడలేదట. ఆ సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఆయన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ‘ అనే సినిమా డైరెక్షన్ లో బిజీగా ఉండడం వల్ల తర్వాత చూద్దాంలే అని ఆ సినిమాను చూడకుండా వదిలేసారట. ఇక దాంతో ఓటిటి లోకి వచ్చిన తర్వాత సినిమాని చూద్దామనుకున్నా కూడా ఇప్పటి వరకు ఆ సినిమా ఓటిటి లో రిలీజ్ కాకపోవడం తో ఆయన చూడలేదట…

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రానా హీరోగా వచ్చిన లీడర్ సినిమాని కూడా శేఖర్ కమ్ముల థియేటర్లో చూడలేదట. ఆ తర్వాత టీవీలో వచ్చినప్పుడు చూశారట. సినిమా కొంచెం డివైడ్ టాక్ రావడంతో థియేటర్లో చూడ్డానికి ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని అప్పట్లో వార్తలైతే వచ్చాయి. ఇక టివి లో చూసినప్పుడు ఆ సినిమా విషయం లో తను చేసిన మిస్టేక్స్ ఏంటో తనకు తెలిసాయట…

ఇలా కొంతమంది దర్శక నిర్మాతలు వాళ్ళ సినిమాలని చూడడానికి టైం లేకపోవడం ఒక కారణం అయితే మరి కొంతమంది కావాలనే వాళ్ళ సినిమాలని థియేటర్లో చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. మొత్తానికైతే మన హీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరూ కూడా సినిమా బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి సినిమా వాళ్ళు చూసిన చూడకపోయిన ఆడితే, దానికి మించింది మరొక సినిమా చేయాలనుకుంటారు. ఒకవేళ ఆడకపోతే చేసిన మిస్టేక్స్ తెలుసుకొని మరోసారి వాటిని రిపీట్ చేయకుండా ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు…