Homeట్రెండింగ్ న్యూస్Viral Video: ఫోన్ ఇవ్వకుంటే తల్లిపై ఇంత పైశాచికమా..పైగా అంత చిన్న వయసులో..

Viral Video: ఫోన్ ఇవ్వకుంటే తల్లిపై ఇంత పైశాచికమా..పైగా అంత చిన్న వయసులో..

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాల ప్రకారం.. తనకు సెల్ ఫోన్ ఇవ్వనందుకు ఓ కొడుకు తల్లి పై దాడి చేశాడు. క్రికెట్ బ్యాట్ తో విపరీతంగా కొట్టాడు. అతడు కొట్టిన దెబ్బలకు ఆ తల్లి కింద పడిపోయింది. ఆ తర్వాత ఆ కుమారుడు ఆ ఫోన్ తో ఆటలు ఆట మొదలుపెట్టాడు. తన తల్లి అలా పడిపోయినప్పటికీ వీసమెత్తు బాధ కూడా అతడిలో లేదు. పైగా అతడు సెల్ ఫోన్లో గేమ్ ఆడుతూ ఆనందాన్ని పొందడం మొదలుపెట్టాడు. సాధారణంగా స్మార్ట్ ఫోన్ వాడకం ఒక పరిమితికి లోబడి బాగానే ఉంటుంది. తక్కువ ధరకే ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో చాలామంది ఫోన్ కు అతుక్కుపోతున్నారు. మొబైల్ ఫోన్లోనే తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అందులోనే ఉంటున్నారు. ఇక చిన్నారులైతే నిద్ర లేవగానే ఫోన్ పట్టుకుంటున్నారు. యూట్యూబ్లో వీడియోస్, రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కొందరైతే గేమ్స్ ఆడుతూ.. అదే మైకంలో మునిగితేలుతున్నారు. దీంతో తల్లిదండ్రులకు తమ పిల్లల్ని కాపాడుకోవడం ఎలాగో తెలియడం లేదు. ఫోన్ ఇవ్వకపోతే పిల్లలు గోల చేస్తున్నారు. ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు. దీనికంటే ఫోన్ ఇవ్వడమే ఉత్తమం అని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అయితే ఆ ఫోన్ కు బానిసలైన చిన్నారులు.. ఒక్క క్షణం కూడా అది లేకుండా ఉండలేకపోతున్నారు. ఇలా ఫోన్ కు బానిసలు కావడం వల్ల పిల్లలు అనారోగ్యాల పాలవుతున్నారు. వారి ఆరోగ్యాలను బాగు చేయడం తల్లిదండ్రులకు కత్తి మీద సాములాగా మారింది.

సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం ఓ బాలుడు తన తల్లి తలపై బ్యాట్ తీసుకొని కొట్టాడు. ఆ దృశ్యాలు చూడడానికి విస్మయాన్ని కలిగించాయి. అయితే ఆ చిన్నారి ముందుగా ఫోన్ చూస్తూ ఉండడంతో.. తల్లి వచ్చి అతడిని మందలించింది. ఆ తర్వాత ఫోన్ లాక్కుంది. బుద్ధిగా చదువుకోవాలి.. పుస్తకాలలో పద్యాలను వల్లే వేయాలని చెప్పింది. ఆ పిల్లవాడు పక్కన ఉన్న పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఫోన్ ఇవ్వాలని తల్లిని కోరాడు. దానికి ఆమె నిరాకరించి. వెంటనే సహనం కోల్పోయి బ్యాట్ తో ఆమె తలపై కొట్టాడు ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ చిన్నారి మాత్రం అదేమీ తెలియనట్టు తన తల్లి చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నాడు. మళ్లీ ఆడటం మొదలుపెట్టాడు.. అయితే ఆ తల్లి లేచిందో? లేవ లేదో తెలియదు. కానీ ఈ వీడియో ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. చిన్నారులు ఏ స్థాయిలో ఫోన్లకు బానిసలు అవుతున్నారో రుజువుగా నిలుస్తోంది. ఇదే సమయంలో సైకాలజిస్ట్లు చిన్నారులకు ఫోన్లు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.. వాటికి అలవాటు పడితే చిన్నారులు మాట వినరని.. అలాంటి అలవాటు వారి మానసిక ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వివరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular