https://oktelugu.com/

Mohanraj: తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఒకప్పటి స్టార్ విలన్…

తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అందుకే ఇతర భాషల నటులు కూడా తెలుగు సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని ఇక్కడ నటించి మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇప్పుడే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఇతర భాషల నటులు నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 4, 2024 / 09:38 AM IST

    Mohanraj

    Follow us on

    Mohanraj: చాలామంది నటులు సినిమాల్లో నటించి వాళ్లకు మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఒకసారి సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ వచ్చిందంటే చాలు వరుసగా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్ళడమే పనిగా పెట్టుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలో వాళ్లకు అవకాశాలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయి. ఇక హీరో హీరోయిన్ అనే కాకుండా విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసే చాలామంది కూడా ఇప్పుడు చాలా బిజీగా ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే కేరళకు చెందిన మోహన్ రాజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఆయన లారీ డ్రైవర్, అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీతయ్య, చెన్న కేశవ రెడ్డి లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సాధించుకున్నాడు.

    ఇక విలన్ గా రాణించడమే కాకుండా మంచి గుర్తింపును కూడా పొందాడు. ఇలాంటి మోహన్ రాజ్ గారు అనారోగ్య కారణంగా రీసెంట్ గా తన తుది శ్వాసను విడిచారు. దీంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురైందనే చెప్పాలి. ఒకప్పుడు ఈయన విలనిజం చాలా అద్భుతంగా ఉండేది. హీరో చేసే యాక్టివిటీ తో తన హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే దానిని మించిన విలనిజంతో ఈయన ప్రేక్షకులను రక్తి కట్టించేవాడు. అందువల్లే హీరో చేసే విన్యాసాలు కూడా చాలా అద్భుతంగా ఉండేవి.

    ఇలాంటి మంచి నటుడు ఇప్పుడు మన మధ్య లేకపోవడం నిజంగా మన అందరి దురదృష్టమనే చెప్పాలి. ఇక మొత్తానికైతే మోహన్ రాజ్ తన ఎంటైర్ కెరియర్ లో తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ చాలా మంచి సినిమాలు చేసి విలన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక 72 సంవత్సరాల వయసులోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అనేది కూడా ఇప్పుడు సగటు అభిమానులందరిని బాధ గురి చేస్తుంది. మరి మొత్తానికైతే ఈయన తెలుగు ప్రేక్షకులలో విశేషమైన ఆదరణను అందుకున్నాడు.

    ఇక స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటించి తనకంటూ ఒక స్టార్ డమ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆయన ఆరోగ్యం విషయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోలేకపోవడం వల్లే ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయిందని గత కొన్ని రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ తన తుది శ్వాస ను విడిచాడని కూడా తెలియజేయడం విశేషం…