Nagarjuna: అందరికి హిట్ ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్ నాగార్జున కి మాత్రం ప్లాప్ ఇవ్వడానికి కారణం ఏంటి..?

తెలుగులో సురేష్ కృష్ణ అనే డైరెక్టర్ వెంకటేష్ , చిరంజీవి లకు తలా రెండు హిట్లను ఇచ్చాడు. కానీ నాగార్జునకు మాత్రం ఒక డిజాస్టర్ సినిమాని ఇచ్చాడు. ఈయన వెంకటేష్ తో ప్రేమ, ధర్మచక్రం అనే రెండు సినిమాలు చేశాడు.

Written By: Gopi, Updated On : February 17, 2024 6:34 pm
Follow us on

Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు హిట్ అవుతుంటే, మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాపులుగా మిగిలిపోతుంటాయి. అయితే కొందరు డైరెక్టర్లు కొంతమంది హీరోలకు మాత్రమే సూపర్ సక్సెస్ లను ఇస్తు ఉంటారు. మరి కొంతమందికి మాత్రం ఫ్లాపులు ఇస్తుంటారు. అలా ఎందుకు చేస్తారు అనే విషయం వాళ్లకు కూడా తెలియదు.

దీని వల్లే కొన్ని కాంబినేషన్లు సక్సెస్ ఫుల్ గా మారితే, మరికొన్ని కాంబినేషన్లు మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటాయి. తెలుగులో సురేష్ కృష్ణ అనే డైరెక్టర్ వెంకటేష్ , చిరంజీవి లకు తలా రెండు హిట్లను ఇచ్చాడు. కానీ నాగార్జునకు మాత్రం ఒక డిజాస్టర్ సినిమాని ఇచ్చాడు. ఈయన వెంకటేష్ తో ప్రేమ, ధర్మచక్రం అనే రెండు సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా వెంకటేష్ ని స్టార్ హీరోగా మార్చడంలో చాలా ముఖ్య పాత్రను పోషించాయి.

ఇక అలాగే చిరంజీవితో మాస్టర్, డాడీ లాంటి రెండు సినిమాలు చేసి మంచి సక్సెస్ లను అందుకున్నాడు. కానీ నాగార్జునతో చేసిన ఆటో డ్రైవర్ సినిమా మాత్రం ప్లాప్ అయింది. వెంకీ కి చిరు కి సూపర్ సక్సెస్ లు ఇచ్చిన ఈయన నాగార్జునకి మాత్రం ఫ్లాప్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటూ అప్పట్లో వీళ్ళ కాంబినేషన్ మీద చాలా వార్తలైతే వచ్చాయి. సురేష్ కృష్ణ కూడా నాగార్జునకి మంచి హిట్ ఇవ్వాలని చూశాడు కానీ అన్ని మనం అనుకున్నట్టు జరగవు కదా అందువల్లే ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిందంటూ కొంతమంది సినీ మేధావులు సైతం అప్పట్లో వీళ్ళ కాంబో గురించి మాట్లాడడం జరిగింది. ఇక తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు.

ఒకవేళ వచ్చుంటే విజయం సాధించి ఉండేదేమో అనే అభిప్రాయాలు వ్యక్తం చేసే వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం సురేష్ కృష్ణ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు. కాబట్టి ఇక వీళ్ళ కాంబో లో సినిమా అనేది రాకపోవచ్చు. ఇక మొత్తానికైతే నాగార్జున కి సురేష్ కృష్ణ ఒక హిట్ భాకి పడి పోయాడని నాగార్జున అభిమానులు ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు…