Double Ismart: బుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ క్యారెక్టర్ ఏంటంటే..?

ముఖ్యంగా రామ్ ఇస్మార్ట్ శంకర్ లో ఎలాగైతే కనిపించాడో అలాగే ఈ సినిమాలో కూడా తెలంగాణ స్లాంగ్ లో అదరగొడుతూ, నచ్చని వాళ్ళని తుప్పు రెగ్గొడుతూ ముందుకెళ్ళే క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : May 15, 2024 11:36 am

Double Ismart

Follow us on

Double Ismart: ఈరోజు హీరో రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించిన టీజర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ ని కనుక మనం చూసినట్లయితే మొదటగా ఈ టీజర్ లో డబుల్ ఇస్మార్ట్ పేరును ప్రస్తావిస్తూ ‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’ అలియాస్ ‘డబుల్ ఇస్మార్ట్’ అంటూ రామ్ చెబుతాడు అంటే ఇస్మార్ట్ శంకరే డబుల్ ఇస్మార్ట్ శంకర్ గా మారబోతున్నాడు అనేది మనకు ఈ టీజర్ లో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.

ఇక ముఖ్యంగా రామ్ ఇస్మార్ట్ శంకర్ లో ఎలాగైతే కనిపించాడో అలాగే ఈ సినిమాలో కూడా తెలంగాణ స్లాంగ్ లో అదరగొడుతూ, నచ్చని వాళ్ళని తుప్పు రెగ్గొడుతూ ముందుకెళ్ళే క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సంజయ్ దత్ ఒక స్టైలిష్ డాన్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ క్రమంలోనే సంజయ్ దత్ కి రామ్ కి మధ్య కొన్ని గొడవలు జరిగి వీళ్ళిద్దరి మధ్య టఫ్ వార్ అనేది జరగబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ టీజర్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేయడంతో పాటుగా టీజర్ లో రెండు మూడు డైలాగులు కూడా అద్భుతంగా పేలే విధంగా వాటిని డిజైన్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఇక పూరి ఏ సినిమా చేసిన ఆ సినిమా టీజర్ తోనే మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది. ఇక ఈ సినిమా కూడా టీజర్ తోనే మంచి హైప్ నైతే క్రియేట్ చేసుకుందనే చెప్పాలి. ఇక పూరి ఈ సినిమాతో మరోసారి తన స్టార్ డమ్ ను విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక పూరి, రామ్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రామ్ ఇందులో కామెడీ చేస్తూనే ఒక మాస్ యాక్షన్ రోల్ ని పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది…