Double Ismart Teaser: టీజర్ లో చూపించిన డబుల్ ఇస్మార్ట్ స్టోరీ ఇదే…

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేసిన స్కందా సినిమా ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో తను ఈ సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : May 15, 2024 11:39 am

Double Ismart Teaser

Follow us on

Double Ismart Teaser: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్..ఈయన ప్రస్తుతం రామ్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ద్వారా మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ముందు చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండడంతో ఈ సినిమాతో మరోసారి తను భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇంతకుముందు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేసిన స్కందా సినిమా ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో తను ఈ సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు.

అయితే ఈ టీజర్ ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే సినిమా స్టోరీని టీజర్ లోనే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక డాన్ అయిన సంజయ్ దత్ చేసిన ఒక క్రైమ్ లో రామ్ ను అనుకోకుండా ఇరికిస్తారు. ఇక అప్పట్నుంచి రామ్ తను ఏ తప్పు చేయలేదు అసలు తప్పు చేసిన వాడు ఎవడో వాన్ని పోలీసులకి పట్టిస్తానని చెప్పి సంజయ్ దత్ కోసం వెతికి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించడమే ఈ సినిమా స్టోరీగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా స్టోరీలో పెద్దగా వైవిధ్యం లేనప్పటికీ దర్శకుడు పూరి కొత్త పంథా లో ఈ సినిమాను తీసుకెళుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది.

ఇక టీజర్ ని కనక మనం చూసినట్లయితే మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్ కట్ చేశారు. ఇక ఈ సినిమా అటు రామ్ కి, ఇటు పూరి జగన్నాథ్ కి ఒక భారీ సక్సెస్ ని అందించాలని వాళ్ళ అభిమానులు కూడా కోరుకుంటున్నారు…చూడాలి మరి ఈ సినిమా వాళ్లకు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో…