Mirai movie villain child episode: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు తేజ సజ్జ…తను హీరోగా మారి చేసిన సినిమాలు ప్రస్తుతం మంచి విజయాలను సాధిస్తున్నాయి. హనుమాన్ సినిమాతో 400 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసిన ఆయన ఇప్పుడు మిరాయ్ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా సూపర్ సక్సెస్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ నటించిన విషయం మనకు తెలిసిందే…
చాలా సంవత్సరాల తర్వాత మంచు మనోజ్ విలన్ గాఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా అతనికి పర్ఫెక్ట్ కంబ్యాక్ సినిమా అయిందనే చెప్పాలి… ఇక ఈ సినిమాలో విలన్ చైల్డ్ ఎపిసోడ్ దైవంతో ముడిపడి ఉంటుంది. దేవుడు అన్ని చేస్తున్నాడు అంటే ఆ పిల్లవాడు ఒప్పుకోడు నేనే దేవున్ని అనే రేంజ్ లో ఊహించుకుంటాడు.
దాంతో తాంత్రిక శక్తిని నేర్చుకొని అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే దాచి ఉంచిన ఆ తొమ్మిది గ్రంథాలను దక్కించుకొని తను దేవుడు అవ్వాలని చూస్తూ ఉంటాడు…ఇక ఈ చైల్డ్ ఎపిసోడ్ మొత్తం హరికథ అనే వెబ్ సిరీస్ నుంచి తీసుకున్నారు అనే టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకు అంటే ఈ సిరీస్ లో కూడా చిన్నప్పుడు ఊర్లలో ఎదురైన ఇబ్బందులు కులం,మతం అనే వాటి వల్ల అతను అలా మారతాడు.
ఇక మిరాయి సినిమాలో కూడా అలాంటి ఒక ఎపిసోడ్ అయితే ఉంది కాబట్టి ఇది కాపీ చేశారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో కార్తీక్ ఘట్టమనేని, తేజ సజ్జ, మంచు మనోజ్ ముగ్గురికి చాలా మంచి విజయం అయితే దక్కిందనే చెప్పాలి. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…