Kishkindhapuri First Day Collections: చాలా కాలం గ్యాప్ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ‘భైరవం’ చిత్రం తో మన ముందుకొచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు కానీ, ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఒక సెక్షన్ ఆడియన్స్ కి ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమా విడుదలైన రెండు నెలలకు ఆయన ‘కిష్కింధపురి'(Kiskindhapuri) అనే చిత్రం తో మన ముందుకొచ్చాడు. అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ఇందులో హీరోయిన్ గా నటించింది. సినిమా విడుదలకు ముందే ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తో ఆడియన్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. విడుదల తర్వాత ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ ఈ సినిమా విడుదలైన రోజునే మిరాయ్ లాంటి భారీ అంచనాలు ఉన్న సినిమా విడుదల అవ్వడం తో ఓపెనింగ్స్ అనుకున్నంత రేంజ్ లో రాలేదు.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, కోటి 30 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఓవర్సీస్,కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా కలిపి ఈ చిత్రానికి కోటి 80 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇది డీసెంట్ స్థాయి వసూళ్లే అయినప్పటికీ ‘మిరాయ్’ తో పోటీ పడకుండా, వేరే సమయం లో ఈ చిత్రాన్ని విడుదల చేసుంటే కచ్చితంగా బెల్లకొంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టిన సినిమాగా నిలిచేది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ ఈ చిత్రానికి మౌత్ టాక్ మాత్రం చాలా పాజిటివ్ గా ఉంది. ఎంతలా అంటే మిరాయ్ చిత్రం కంటే ఎక్కువ టాక్ ఉంది. కాబట్టి ఓపెనింగ్స్ లో కాస్త తడబడినా, ఓవరాల్ క్లోజింగ్ లో సూపర్ హిట్ గానే నిలుస్తుందని అంటున్నారు.
రెండవ రోజు వసూళ్లు ఈ చిత్రానికి మొదటి రోజు కంటే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. బుక్ మై షో యాప్ లో కూడా ఈ చిత్రానికి గంటకు నాలుగు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లను రాబడుతుందని అర్థం అవుతుంది. వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కుకు అతి దగ్గరగా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కి చాలా కాలం తర్వాత వచ్చిన సరైన సూపర్ హిట్ చిత్రం ఇదే అనుకోవచ్చు. చూడాలి మరి ఈ సినిమా కలెక్షన్స్ రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.