https://oktelugu.com/

Vishwambhara: విశ్వంభర సినిమా టార్గెట్ ఎన్ని వందల కోట్లంటే..?

చిరంజీవి కనక విశ్వంభర సినిమాతో సక్సెస్ ని కొట్టినట్టైతే ఆయన మార్కెట్ పాన్ ఇండియాలో భారీగా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించినట్టుగా తెలుస్తుంది.

Written By: , Updated On : May 8, 2024 / 08:24 AM IST
Vishwambhara

Vishwambhara

Follow us on

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 70 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్నా కూడా వరుస సినిమాలను సెట్స్ మీదకి తీసుకెళ్తూ తొందరగా షూటింగ్ కంప్లీట్ చేస్తూ సినిమా రిలీజ్ చేసే ప్లాన్ అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే చిరంజీవి కనక విశ్వంభర సినిమాతో సక్సెస్ ని కొట్టినట్టైతే ఆయన మార్కెట్ పాన్ ఇండియాలో భారీగా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇది సోషియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాని ఎక్కడ తగ్గకుండా డైరెక్టర్ వశిష్ఠ చాలా రిచ్ గా తీస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక సినిమా యూనిట్ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 500 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుందనే అంచనాలో ఉన్నారు.

ఇక ఇంతకు ముందు చిరంజీవి భారీ బడ్జెట్ తో చేసిన సైరా సినిమా పెద్దగా విజయం సాధించలేదు. మరి ఈ సినిమా కూడా మరో సైరా సినిమా అవుతుందా లేదా మంచి విజయాన్ని సాధించి మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి చేసే ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడిని మెప్పించడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నాయి.

కాబట్టి చిరంజీవి ఎలాగైనా సరే ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టి తన స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నాడు. ఇక అనుకున్నట్టుగా ఔట్ పుట్ తీసుకురాగలిగితే మాత్రం ఈ సినిమా దాదాపు 500 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందంటూ సినిమా యూనిట్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు…