Chiranjeevi-Balayya: సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు లను ఎలాగైతే ఇండస్ట్రీకి రెండు కండ్లుగా చెబుతూ ఉంటారో, ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ లను కూడా అలాగే చెప్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దాదాపు 35 సంవత్సరాల పాటు కొనసాగుతూ వస్తున్నారు. ఇక ఇప్పటికి కూడా వీళ్ళ సినిమాలను ప్రేక్షకులు చూడడానికి ఇష్టపడుతున్నారు అంటే వాళ్ల టాలెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి.
అయితే వీళ్ళిద్దరూ స్టార్ హీరోలుగా ఎప్పటికప్పుడు సినిమాల పరంగా పోటీపడుతున్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య మాత్రం మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాలయ్య ఇంట్లో ఫంక్షన్ అయితే చిరు, వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే బాలయ్య వస్తూ హంగామా చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళు ఒకరినొకరు బ్రదర్స్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే వీళ్ళ కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమా ఇంతకుముందు ఎప్పుడో రావాల్సింది. కానీ అది అనుకోని కారణాలవల్ల ఆగిపోతూ వస్తుంది.
ఇక ఇప్పుడు ఇండియా లోనే టాప్ రైటర్ గా గుర్తింపు పొందిన విజయేంద్రప్రసాద్ వీళ్ళిద్దరిని కలుపుతూ ఒక మల్టీస్టారర్ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ఇద్దరికీ సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుందని ఏ క్యారెక్టర్ ఎవరు చేసిన కూడా ఇద్దరు ఎలివేట్ అవుతారని విజయేంద్ర ప్రసాద్ చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నట్టు గా తెలుస్తుంది. మరి ఈ సినిమా కనక సెట్స్ మీదికి వెళితే బాగుంటుంది. కానీ వీళ్ళ ఇద్దరి ఇమేజ్ ను హ్యాండిల్ చేస్తూ డైరెక్షన్ చేసే డైరెక్టర్ ఎవరు ఉన్నారు, అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. ఇక ఈ విషయంలో రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ అయితే చాలా బాగా చేస్తాడు. కానీ రాజమౌళి ఇప్పుడున్న పరిస్థితిలో వీళ్లతో సినిమాలు చేసే ఉద్దేశ్యంలో అయితే లేడు. కాబట్టి ఈ సినిమాని పూరి జగన్నాథ్ అయితే బాగా హ్యాండిల్ చేయగలడు అంటూ మరి కొంతమంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
ఎందుకంటే పూరి అయితే ఇటు బాలయ్యతో, అటు చిరంజీవితో ఇద్దరితో మంచి సన్నిహితంగా ఉంటాడు. ఆయన ఇప్పటికే బాలయ్య బాబుతో ‘పైసా వసూలు’ అనే సినిమా చేశాడు. బాలయ్యతో ఆయనకు మంచిర్యాపో ఉంది. ఇక చిరంజీవి తో కూడా తనకి మంచి అనుబంధం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ ని హ్యాండిల్ చేయాలంటే పూరీ అయితేనే కరెక్ట్ అంటూ సోషల్ మీడియా లో నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు…చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More