India vs Bangladesh: టి20 వరల్డ్ కప్ లో ఛాంపియన్ గా అవతరించిన తర్వాత టీమిండియా సీనియర్ ఆటగాళ్లు లేకుండానే రంగంలోకి దిగుతోంది. సూర్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలోని టీమిండియా ఆదివారం నుంచి బంగ్లాదేశ్ జట్టుతో టి20 సిరీస్ మొదలుపెట్టనుంది.. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడంతో జట్టు మొత్తం యువ ఆటగాళ్లతో కనిపిస్తోంది.. ఇప్పటికే టెస్ట్ సిరీస్ 0-2 తేడాతో పర్యటక జట్టు బంగ్లాదేశ్ కోల్పోయింది. దీంతో పొట్టి ఫార్మాట్ లో సత్తా చూపించాలని భావిస్తోంది. పెద్దగా అనుభవం లేని ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్ నెగ్గాలని యోచిస్తోంది.
జట్టులో మార్పులు
బంగ్లాదేశ్ జట్టుతో టి20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాలో అనుకోని కుదుపు ఏర్పడింది. ఆల్ రౌండర్ శివం దూబే వెన్ను సంబంధిత నొప్పితో సిరీస్ నుంచి వైదొలినట్టు తెలుస్తోంది. అతడి స్థానంలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మను ఎంపిక చేశారు. ఆదివారం ఉదయం నుంచి అతను జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే తిలక్ వర్మకు జట్టులో అవకాశం కల్పిస్తారా? లేక నితీష్ కుమార్ రెడ్డితో ఆడిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఈ ఏడాది ఐపిఎల్ లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్ బంగ్లాదేశ్ సిరీస్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఐపీఎల్ తర్వాత అతడు గాయాల బారిన పడ్డాడు. గత కొద్దిరోజులుగా నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. తీరా ఇన్ని రోజులకు పూర్తిస్థాయిలో ఫిట్ నెస్ సాధించాడు.
షకీబ్ లేకుండా..
బంగ్లాదేశ్ జట్టు ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ లేకుండా బంగ్లాదేశ్ టి20 మ్యాచ్ లు ఆడుతోంది. తాజాగా ఈ టీమ్ లో ఎక్కువమంది టెస్ట్ సిరీస్ లో ఆడని ఆటగాళ్ళు ఉండడంతో వారిపై ఎటువంటి ఒత్తిడి ఉండదని తెలుస్తోంది. 14 నెలల అనంతరం t20 ఫార్మాట్ లో స్పిన్నర్ మిరాజ్ ఆడుతున్నాడు. ఇక బంగ్లా బ్యాటింగ్ భారం మొత్తం షాంటో, లిటన్ దాస్ మీదే ఆధారపడి ఉంది..
14 సంవత్సరాల తర్వాత..
భారత్ – బంగ్లా మధ్య టి20 మ్యాచ్ గ్వాలియర్ లో జరుగుతుంది. ఈ మైదానం వేదికగా టీమిండియా ఒకప్పటి ఆటగాడు సచిన్ టెండూల్కర్ వన్డేలలో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2010లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. అప్పటినుంచి ఈ మైదానంలో మరో మ్యాచ్ జరగలేదు.. తాజాగా ఈ ప్రాంతంలో మాధవరావు సింధియా పేరుతో మరో మైదానాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ మైదానం వేదికగానే బంగ్లాదేశ్ జట్టుతో జరిగే టి20 మ్యాచ్ ను భారత్ ఆడనుంది.
జట్ల అంచనా ఇలా
భారత్: సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ/ నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, సంజు సాంసన్, అభిషేక్ శర్మ.
బంగ్లాదేశ్
షాంటో(కెప్టెన్), మిరాజ్, లిటన్ దాస్, పర్వేజ్, తన్జీద్, తౌహిద్, మహమ్మదుల్లా, రిషాద్ హుస్సేన్, తన్జీమ్, తస్కిన్, ముస్తాఫిజుర్.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: India vs bangladesh 1st t20 playing 11 live time head to head streaming
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com