https://oktelugu.com/

Prashant Kishor: ఏపీలో పీకే జోష్యం నిజమవుతుందా..?

పీకే తన ఇంటర్వ్యూను కూడా పక్కా స్ట్రాటజీతోనే ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇంటర్వ్యూలో తల్లి, చెల్లి నమ్మని వాడిని ప్రజలు ఎలా నమ్ముతారు. తల్లి, చెల్లికి ఎవరైనా డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తారా.. అని ప్రశ్నించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 14, 2024 / 03:41 PM IST

    Prashant Kishor

    Follow us on

    Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌.. అలియాస్ పీకే ఓ పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌. రెండేళ్ల క్రితం స్ట్రాటజీలు మానేశానని ప్రకటించారు. బీహార్‌లో ఓ పార్టీ పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. ఏపీలో ఎన్నికల వేళ.. ఇతను మళ్లీ తెరపైకి వచ్చాడు. రెండ నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబును కలిశాడు. తాజాగా ఏపీలో పోలింగ్‌కు మూడు రోజుల ముందు ఓ యూట్యూబ్‌ చానెల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని తన స్ట్రాటజీ చెప్పాడు. సోమవారం జరిగిన పోలింగ్‌ సరళిని చూసిన విశ్లేషకులు పీకే అంచనాలు నిజమవుతాయా అని చర్చించుకుంటున్నారు.

    పక్కా స్ట్రాటజీతో..
    ఇక పీకే తన ఇంటర్వ్యూను కూడా పక్కా స్ట్రాటజీతోనే ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇంటర్వ్యూలో తల్లి, చెల్లి నమ్మని వాడిని ప్రజలు ఎలా నమ్ముతారు. తల్లి, చెల్లికి ఎవరైనా డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తారా.. అని ప్రశ్నించారు. వైసీపీ 151 నుంచి 51 స్థానాలకు పడిపోతుంది అని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి కారణం బేవకూఫ్‌ల మాటలు వినడమే అని వ్యాఖ్యానించారు. 2019లో ఎక్కడ మొదలు పెట్టాడో.. అక్కడికే రాబోతున్నాడని జోష్యం చెప్పారు. ఇక బొత్స సత్యనారాయణపై కీలక ఆరోపణలు చేశారు. ఆయన ఎవరి పక్కన ఉంటే వారిని మోసం చేస్తాడని పేర్కొన్నారు. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆయన టీడీపీలో చేరతారని కూడా వెల్లడించాడు.

    జోష్యం ఫలిస్తుందా..
    పక్కా వ్యూహంతో పీకే చేసిన వ్యాఖ్యలు, ఆరోపణల ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల తర్వాత పోలింగ్‌ సరళిని చూసి చాలా మంది పీకే వ్యాఖ్యలను పోల్చి చూసుకుంటున్నారు. మరి జీకే జోష్యం ఏమేరకు నిజమవుతుందో జూన్‌ 4న తేలుతుంది.