Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రాబోతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది చిత్ర యూనిట్. ఇటీవల సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది సినిమా. అయితే ఇందులో ఉన్న కొన్ని మాటలను మ్యూట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిందట సెన్సార్. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగడంతో సినీ బృందం మొత్తం హాజరైంది.
ఈ సందర్భంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ వాడిన ఒక పదం తెగ వైరల్ గా మారింది. ఈ స్టార్ హీరో ఎక్కడికి వెళ్లిన సరే తనదైన ముద్ర వేసుకుంటాడు. తన స్టైల్ ను అసలు విడిచిపెట్టడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంటే కాస్త ఎంట్రీ డిఫరెంట్ గా ఉండాలని బైక్ మీద వేడుక జరుగుతున్న ప్రదేశానికి వచ్చాడు విజయ్. వెనకాల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఉంది. అయితే తనకు ఎదురుగా ఉన్న వారితో ఆయన మాట్లాడిన ఓ పదం వైరల్ గా మారింది.
విజయ్ దేవరకొండ బైక్ మీద వెళ్తూ వెనకాల హీరోయిన్ ను కూర్చోబెట్టుకొని పబ్లిక్ లో కనిపిస్తే ఫ్యాన్స్ రాకుండా ఉంటారా? అదే విధంగా ఆయన బైక్ ముందు అభిమానులు వచ్చారు. అయితే ఈ సందర్భంగా జరగండ్రా అని ఆ తర్వాత మరొక పదం వాడారు విజయ్. ఈ పదం సాధారణంగా స్నేహితుల మధ్యలో వింటాం. కానీ తెలియని వారి వద్ద కొన్ని పదాలు మాట్లాడకూడదు. అలాంటి పదమే విజయ్ మాట్లాడారు అని టాక్.
మనకు మామూలుగా అనిపించినా కొన్ని పదాలు ఇతరులకు నచ్చకపోవచ్చు. అయితే విజయ్ మాట్లాడిన పదం ఏంటి అనుకుంటున్నారా. అరెయ్ జరగండ్రా నీయబ్బ అని అన్నారు. ఇది నవ్వుతూ ఫన్నీగా అన్నట్టు తెలుస్తోంది. కానీ ఇలాంటి పదాలు నచ్చని వారు మాత్రం పబ్లిక్ లో ఇలాంటి పదాలు వాడటం అవసరమా భయ్యా అంటున్నారు. మరి దీనికి విజయ్ సమాధానం చెప్తారో లేదో చూడాలి.