Venkatesh role in Adarsha Kutumbam: కెరియర్ మొదట్లో రచయితగా తన సత్తా చాటుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత దర్శకుడిగా మారి పలు వైవిద్య భరితమైన సినిమాలను చేశాడు. ఆయన చేసిన సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అతని సినిమాలు చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అతని సినిమాలన్నీ కుటుంబ కథ నేపథ్యంలోనే సాగుతుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో వెంకటేష్ ఫ్యామిలీని కాపాడే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. ఆ క్యారెక్టర్ ని గుర్తు చేసుకుంటే ‘అజ్ఞాతవాసి’ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర లాగానే ఉండబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి త్రివిక్రమ్ సైతం అజ్ఞాతవాసి సినిమాతో సక్సెస్ సాధించలేదనే రీగ్రేట్ లో ఉన్నారట. ఇక అదే క్యారెక్టర్ ని తీసుకొచ్చి కథగా రాసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ ఈ సినిమాతో ఏ విధమైన మ్యాజిక్ చేస్తాడు. మొత్తానికైతే సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపుతాడా లేదా అనేది అందరిలో ఒక భయాన్ని కలిగిస్తుంది…
ప్రేక్షకులందరిని ఎంటర్టైన్ చేయగలిగే కెపాసిటి ఉన్న త్రివిక్రమ్ ఇంతకు ముందు చేసిన ‘గుంటూరు కారం’ సినిమాతో భారీగా డీలా పడ్డాడు. ఇక మరోసారి తన సత్తా చాటుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
Also Read: ‘పెద్ది’ మూవీ టీం పై పవన్ కళ్యాణ్ ఫైర్.. వణికిపోయిన డైరెక్టర్ బుచ్చి బాబు!
వెంకటేష్ సైతం ఈ సినిమాలో కామెడీ రోల్ చేస్తూనే కొన్ని సీరియస్ సన్నివేశాల్లో కనిపించబోతున్నాడట. కామెడీ యాక్షన్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాల్లో కామెడీ బాగుంటుంది. త్రివిక్రమ్ రాసిన మాటలు తూటాల్లా పేలుతుంటాయి. త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించకపోయిన కూడా రచయితగా వ్యవహరించాడు.
కాబట్టి ఈ సినిమాలోని కామెడీ సీన్ల వల్ల ఆ సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయని ప్రతి ఒక్కరు నమ్ముతుంటారు. కాబట్టి త్రివిక్రమ్ డైరెక్షన్ కి వెంకటేష్ యాక్టింగ్ తోడైతే అది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా నిలుస్తుందనేది ఇప్పటికి రెండు సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రూవ్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…