Veera Simha Reddy Collections: ఒక సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ అందుకోవాలంటే కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ బాగా ఉండాలి అని సూత్రం ఈ సంక్రాంతి నిరూపించింది..మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం వసూళ్ల పరంగా ఏకంగా #RRR సినిమా రికార్డ్స్ ని సవాలు చేస్తుంటే, మరోపక్క ‘వీర సింహా రెడ్డి’ సినిమా మాత్రం యావరేజి వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన బంపర్ ఓపెనింగ్స్ ఇప్పట్లో ఎవ్వరూ మర్చిపోలేరు..కానీ రెండవ రోజు నుండి ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టడం లో ఈ చిత్రం విఫలం అయ్యింది..అయ్యినప్పటికీ వరల్డ్ వైడ్ గా సుమారుగా ఇప్పటి వరకు 71 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా నిలిచింది..కానీ ఈ సినిమా కి వచ్చిన హైప్ ని చూస్తే వంద కోట్ల రూపాయిల షేర్ వస్తుందని అందరూ అనుకున్నారు.
కానీ ఈ సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా ఈ సినిమాని పట్టించుకోలేదు..అందుకే లాంగ్ రన్ కష్టం అయ్యింది..మరో పక్క ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేసిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ కి ఫ్యామిలీస్ బ్రహ్మరథం పట్టారు..అందుకే పండగ అయిపోయిన తర్వాత కూడా ఈ సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి..ఫుల్ రన్ లో కచ్చితంగా 130 కోట్ల రూపాయిల మార్కుని కూడా అందుకోబోతుంది.

ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 16.20 కోట్లు
సీడెడ్ 15.65 కోట్లు
ఉత్తరాంధ్ర 7.07 కోట్లు
ఈస్ట్ 5.42 కోట్లు
వెస్ట్ 4.02 కోట్లు
నెల్లూరు 2.77 కోట్లు
గుంటూరు 6.15 కోట్లు
కృష్ణ 4.45 కోట్లు
మొత్తం 61.73 కోట్లు
ఓవర్సీస్ 5.60 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.60 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 71.93 కోట్లు
కానీ ‘వీర సింహా రెడ్డి’ చిత్రం మాత్రం 75 కోట్ల రూపాయిల షేర్ దగ్గరే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..ఎందుకంటే ఈ సినిమాకి 9 వ రోజు కోటి రూపాయిల కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి..కేవలం 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది..వీకెండ్స్ లో పుంజుకుంటుంది అని అనుకుంటే మరింత బలహీన పడింది..ఇక సోమవారం నుండి ఫుల్ రన్ వరకు కనీసం మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధిస్తుందా లేదా అనేది చూడాలి.