Director Bobby: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి సూపర్ హిట్టై మెగాస్టార్ ఖాతాలో మరో వంద కోట్ల రూపాయిల సినిమాగా నిలిచింది..వరుసగా ఆచార్య మరియు గాడ్ ఫాదర్ వంటి రెండు కమర్షియల్ ఫెయిల్యూర్స్ తో డీలాపడిన మెగా ఫ్యాన్స్ కి ఒక రేంజ్ ఊపు ని రప్పించింది ఈ సినిమా.

పండుగ సెలవలు అయిపోయినా కూడా ఇప్పటికీ ఈ చిత్రానికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి..చాలా చోట్ల ‘వీర సింహా రెడ్డి’ మూవీ థియేటర్స్ ని తొలగించి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి కేటాయిస్తున్నారు..ఈ వీకెండ్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి ఊహించని రేంజ్ లో థియేటర్స్ పెరిగాయి..ఇప్పటికే వంద కోట్ల రూపాయిల షేర్ మార్కు ని దాటేసిన ఈ సినిమా, వీకెండ్ పూర్తయ్యేసరికి 110 కోట్ల రూపాయిలు దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణాల్లో కొరటాల శివ కూడా ఒకడు అట..ఈ విషయాన్నీ స్వయంగా డైరెక్టర్ బాబీ ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు..ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం కథ పూర్తి అయినా తర్వాత కొరటాల శివ కి చెప్పానని, కథలో చిరంజీవి తమ్ముడి పాత్రకి రవితేజ ని తీసుకుంటే బాగుంటుందని కొరటాల గారే సజెస్ట్ చేసాడూ అంటూ డైరెక్టర్ బాబీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి..ఈ సినిమా సెకండ్ హాఫ్ లో రవితేజ పాత్ర ఎంట్రీ ఉంటుంది..సినిమాకి ఈ పాత్ర ఎంత బలాన్ని చేకూర్చిందో అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా చిరంజీవి మరియు రవితేజ మధ్య వచ్చిన బాండింగ్ సన్నివేశాలు మరియు ఎమోషనల్ సన్నివేశాలు ఫ్యాన్స్ ని కంటతడి పెట్టించేలా చేసాయి..అంత గొప్ప పాత్ర పెట్టాలనే ఐడియా కొరటాల శివ నుండి రావడం అనేది గొప్ప విషయం..చిరంజీవి తో ఆయన గతంలో చేసిన ‘ఆచార్య’ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే..మెగా అభిమానులు ఆ విషయం లో కొరటాల శివ ని జీవితం లో క్షమించేలా లేరు..ఇప్పుడు ఈ విషయం తెలియడం తో వాళ్ళ ఆవేశం కొంచెమైనా తగ్గుతుందో లేదో చూడాలి.